Sonia Displeased With Siddaramaiah's Decision to Set Up ACB

Acb creates rift in congress

chief minister, sidda ramaiah, acb, congress, Digvijay Singh, lokayukta, Rahul Gandhi, Anti Corruption Bureau (ACB), sonia gandhi, sm krishna, detailed explanation, Congress high command

The Congress high command is not pleased with Chief Minister Siddaramaiah’s decision to set up the Anti Corruption Bureau (ACB) without much deliberations within the party forum.

ఏసీబీ ఏర్పాటు ఆయన మెడకు చుట్టుకుంది.. పునారాలోచనలో సిద్దూ..

Posted: 03/21/2016 04:47 PM IST
Acb creates rift in congress

రాష్ట్రంలో తొలిసారిగా అవినీతి నిరోధక శాఖ (యాంటీ కరెప్షన్ బ్యూరో) శాఖను ఏర్పాటు చేయడంతో ఆది కాస్తా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మెడకే చుట్టుకుంది. ఓ వైపు పార్టీ సీనియర్ల చేత విమర్శల పాలైన ఆయన మరోవైపు అధిష్టానం ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఇక దీంతో అవినీతి నిరోధక శాఖ ఏర్పటు చేయడంపై ఆయన పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఏసీబీ ఏర్పాటుపై వివరణ కూడా కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం అవినీతి కేసుల దర్యాప్తు కోసం లోకాయుక్త ఉన్న విషయం తెలిసిందే. ఈ సంస్థకు దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా గుర్తింపు ఉంది. అయినా కూడా సిద్ధు అవినీతి నిరోధక శాఖ ఏర్పాటు చేస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయం అధిష్టానానికి ఆగ్రహం కల్గిస్తోంది.

ఏసీబీని ఏర్పాటు చేయడం ఆ శాఖకు ఐపీఎస్ అధికారులను కూడా నియమించారు. అయితే ఈ శాఖను నిర్వీర్యం చేయడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని విపక్షాలతో పాటు న్యాయనిపుణులు కూడా పేర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రజలు కూడా ప్రభుత్వ చర్యలను తప్పుపడుతున్నారు. ఇదిలా ఉండగా ఏసీబీ విషయమై కాంగ్రెస్ పార్టీ వేదికపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట మాత్రమైనా చర్చించలేదని ఆ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు.

అంతేకాకుండా ఏసీబీ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయని, ఇదే విషయాన్ని వారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా సిద్ధరామయ్య బడ్జెట్ రూపకల్పన సమయంలో కూడా పార్టీ సీనియర్ నేతలను సంప్రదించలేదని వారు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.ఎం కృష్ణ ‘బడ్జెట్ రూపకల్పనకు ముందు సీఎం సిద్ధు నన్ను సంప్రదించలేదు. ఇది సరికాదు. అడిగి ఉంటే సలహాలు ఇచ్చేవాడిని’ అని బహిరంగంగా ఆక్రోశించిన విషయం తెలిసిందే.

ఇలా అన్ని విషయాల్లోనూ సిద్ధరామయ్య ఏకపక్షంగా వ్యవహరిస్తూ సీనియర్ నాయకులను నిర్లక్ష్యం చేస్తున్నారని హైకమాండ్‌కు ఫిర్యాదు చేసిన నేతలు వాపోయారు. దీంతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ విషయమై సీఎం సిద్ధును వివరణ కోరినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. అసలే వాచ్ వివాదం విషయంలో హైకమాండ్ ఆగ్రహానికి గురైన సిద్దుకు ఏసీబీ ఏర్పాటుతో తనకు తానుగా చిక్కుల్లో పడినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cm sidda ramaiah  acb  congress  Digvijay Singh  lokayukta  Rahul Gandhi  

Other Articles