Girl's iPhone catches fire on flight to Hawaii

Girl s iphone catches fire on flight to hawaii

apple iphone, iphone, iPhone catches fire on flight to Hawaii, iPhone catches fire on flight, iPhone catches fire, passenger's iPhone burst into flames, iPhone catches fire Alaska Airlines flight, Alaska Airlines flight, Washington to Hawaii, alaska airlines, Washington, Hawaii, Anna Crail

America's Federal Aviation Administration has launched an investigation after a passenger's iPhone burst into flames on an Alaska Airlines flight from Washington to Hawaii.

విమానంలో పేలిన ఐఫోన్.. ఆందోళనలో ప్రయాణికులు

Posted: 03/21/2016 05:59 PM IST
Girl s iphone catches fire on flight to hawaii

విమానంలో ప్రయాణికురాలి ఐఫోన్‌ పేలిపోవడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురైన ఘటన అలాస్కా ఎయిర్‌లైన్స్‌ విమానంలో చోటుచేసుకుంది. ఓ పద్దెనిమిదేళ్ల యువతి స్థానిక మీడియాకు వెళ్లడించిన వివరాల ప్రకారం.. తమ సహ ప్రయాణికురాలి మొబైల్ ఫోన్ నుంచి అకస్మికంగా వచ్చిన మంటలతో విమానంలోని ప్రయాణికులంతా అందోళన చెందరన్నారు. ఆనాక్రెయిల్‌ అనే యువతి వాషింగ్టన్‌ నుంచి హోనులులుకి తమ విమానంలో ప్రయాణిస్తుందని తెలిపింది.

విమానం బయలుదేరిన కొద్దిసేపటి తర్వాత ఆమెకు ఏమీ తోచక తన ఐఫోన్‌లో సినిమా చూస్తూ కూర్చుంది. కొద్దిసేపటికే ఫోన్‌ అకస్మికంగా పేలిపోయింది. దాంతో షాక్ లోకి జారుకున్న అన్నా.. తేరుకుని చూసేసరికి మొబైట్ ఫోన్ కు మంటలుంటున్నాయి. దీంతో ఆమె భయపడి ఫోన్‌ కింద పడేసింది. అది కాస్తా పక్క సీటు కిందకి జారిపోయింది. మంటలు స్వల్పంగా ఎగిసిపడుతుండటంతో ప్రయాణికులకు గుండె ఆగినంతపనైందిని వాపోయింది. వెంటనే అక్కడున్న ప్రయాణికులు లేచి నిల్చున్నారు

ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రయాణికుల అరుపులు విన్నగానే ఏం జరిగిందో తెలుసుకునేందుకు తాము అక్కడకు చేరుకున్నామని విమాన సిబ్బంది మీడియాతో చెప్పారు. కాగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాటిని నియంత్రించే నిష్ణాతులైన విమాన సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేశారన్నారు. కాగా, ఈ ఘటనపై అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : apple  ipone  burst  alaska airlines  Washington  Hawaii  Anna Crail  

Other Articles