Privileges Committee Gives Another Opportunity to Roja, Suspension to Continue

Roja to get another chance to appear before house panel

high court, supreme court, Assembly, Speaker, yanamala ramakrishnudu, kodela shiva prasadrao, High Court, suspension petititon, roja, YSRCP,, privileges committee, ap legislative assembly, ysrcp mlas, chevireddy bhaskar reddy, rk roja, yanamala ramakrishnudu, kotamreddy sridhar reddy, jyothula nehru, kodali nani

The Andhra Pradesh Legislative Assembly discussed the report of the Privileges Committee on five YSRCP MLAs - RK Roja, Kodali Nani, Chevireddy Bhaskar Reddy, Kotam Reddy Sridhar Reddy and Jyothula Nehru

రోజాకు మరో అవకాశం.. సస్పెన్షన్ కొనసాగింపు...

Posted: 03/21/2016 08:39 PM IST
Roja to get another chance to appear before house panel

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ వేటు కొనసాగుతుందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలో ప్రకటించారు. రోజాపై సస్పెన్షన్‌ను కొనసాగిస్తూ శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. దీంతో స్పీకర్ సోమవారం సాయంత్రం సభలో ప్రకటన చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జ్యోతుల నెహ్రూ ఇచ్చిన వివరణకు సభ సంతృప్తి చెందిందని అన్నారు. మరో వైపీసీ ఎమ్మెల్యే కొడాలి నానికి ప్రివిలైజ్ కమిటీ షాక్ ఇచ్చింది. కొడాలి నాని ఇచ్చిన వివరణను కమిటీ తిరస్కరించినట్లు స్పీకర్ ప్రకటించారు.

ప్రివిలేజ్‌ కమిటీ ఆధారంగా కొడాలి నాని వ్యవహారంపై ఏం చర్యను తీసుకోవాలనేది సభ నిర్ణయిస్తుందన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ సస్పెన్షన్ వ్యవహారంలో రోజా యుద్ధ మార్గాన్ని ఎంచుకున్నారని అన్నారు. ప్రివిలైజ్ కమిటీ ముందు హాజరయ్యేందుకు వైసీపీ ఎమ్మెల్యో రోజాకు మరో అవకాశం ఇచ్చిందని అన్నారు. అసంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ సభకు రాకపోవడం నిజంగా దురదృష్టకరం అన్నారు. సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవావల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. వాళ్లు కూడా సభకు వచ్చి ఉంటే బాగుండేదన్నారు.

రోజా సభకు చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెబితే సభ నిర్ణయం మరోలా ఉండేదని అన్నారు. పశ్చాత్తాపం వ్యక్తం చేయడం తప్పుకాదని అన్నారు. సభలో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు పశ్చాత్తాపం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయని చాలానే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఇటీవల ప్రివిలేజ్‌ కమిటీ సమావేశానికి రోజా హాజరు కాలేదని, మరోసారి ఆమె ప్రివిలేజ్‌ కమిటీ ఎదుట హాజరయ్యేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. తర్వాత ఆ కమిటీ మరోసారి ఇచ్చే నివేదిక ఆధారంగా రోజాపై చర్యలు తీసుకుంటామన్నారు.

శాసనసభను కించపరిచనందుకు సాక్షి పత్రికకు నోటీసు ఇచ్చామని అన్నారు. జరిగిన పొరపాటుని సరిదిద్దుకుంటున్నామని, అందుకు చింతిస్తున్నామని సాక్షి యాజమాన్యం సమాధానం ఇచ్చారని చెప్పారు. అందుకు సాక్షి పత్రికను అభినందిస్తున్నానని అన్నారు. అసెంబ్లీలో రోజా వివాదంపై ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చ జరిగిన అనంతరం స్పీకర్ పైవిధంగా మాట్లాడారు. అనంతరం సభను స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మంగళవారానికి వాయిదా వేశారు.

ఈ సందర్భంగా మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రోజా సస్పెన్షన్ విషయంలో సభ నిర్ణయమే సుప్రీం అన్నారు. ఏ రూల్‌ ప్రకారమైనా స్పీకర్‌ నిర్ణయం తీసుకోవచ్చన్నారు. రూల్స్‌ ప్రాధాన్యత కాదు, సభ నిర్ణయమే కీలకమన్నారు. సభ నిర్వహణ విషయంలో అన్ని రకాల అధికారాలు ఉన్నాయన్నారు. స్పీకర్ అధికారాలను ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు. ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఆధారంగా వైఎస్సార్సీపీ నేతలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, శ్రీధర్ రెడ్డి, జ్యోతుల నెహ్రూల క్షమాపణలు అంగీకరిస్తున్నామన్నారు. అయితే అనారోగ్యం కారణంగా రోజా విచారణకు హాజరు కాలేరని వైయస్సారా కాంగ్రెస్ పార్టీ ప్రివిలేజ్ కమిటీకి ఇచ్చిన లేఖను సభ పరిగణనలోకి తీసుకుని, కమిటీ ముందు హాజరయ్యేందుకు రోజాకు అసెంబ్లీ మరో అవకాశం ఇచ్చిందని అన్నారు. అప్పటివరకు రోజా సస్పెన్సన్ కొనసాగుతోందని చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles