She is my wife no she is my wife

She is my wife no she is my wife

Wife, One wife two Husbands, Jharkhand

In Jharkhand state, Dhanbagh city, two person went to police for wife. They said that Pinky named woman is their wife.

ఆమె నా భార్య... కాదు నా భార్య

Posted: 03/22/2016 10:08 AM IST
She is my wife no she is my wife

ఒక రాధ ఇద్దరు కృష్ణుల కధ గురించి అందరికి తెలుసు.. ఓ బిడ్డ ఇద్దరు తల్లుల గురించి కూడా విన్నాం. కానీ ఓ భార్య ఇద్దరు భర్తల గురించి ఎప్పుడైనా విన్నారా.? అయితే తాజాగా జరిగిన ఓ ఘటన గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఆమె నా భార్యంటే.. కాదు కాదు ఆమె నా భార్య అంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. జార్ఖండ్ లోని ధన్ బాగ్ నగరంలో పింకీ దేవి అనే మహిళ తన భార్యేనంటూ లాల్తూ బోస్‌, సునీల్‌ శావ్‌ వాగ్యుద్ధానికి దిగడంతో పెద్ద డ్రామానే నడిచింది. వాస్తవానికి లాల్తూ బోస్‌, పింకీదేవి కలిసి సునీల్‌ను పోలీసు స్టేషన్‌కు లాక్కెళ్లారు. తన భార్య అయిన పింకీని అతడి భార్యగా చెప్పుకొంటున్నాడంటూ సునీల్‌పై బోస్‌ ఫిర్యాదు చేశాడు. అలాగే సునీల్‌ ఎవరో తనకు తెలియదని, చుట్టుపక్కల వారందరికీ తనను అతడి భార్యగా చెప్పుకొంటున్నాడని పింకీ కూడా తెలిపింది.

కానీ తాను చెబుతున్నది అక్షర సత్యమని సునీల్‌ వాదిస్తున్నాడు. పింకీ తన భార్యేనని, చూపు దెబ్బతినడంతో తన ఖర్మానికి తనను వదిలేసి, ఇంట్లోని రేషన్‌కార్డుసహా ఉన్నవన్నీ ఊడ్చుకుపోయిందని చెప్పాడు. తమ కాపురానికి సాక్ష్యంగా ఒక బిడ్డ కూడా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఆ తర్వాత ఇద్దర్ని పెళ్లాడి వదిలేసి, ఇప్పుడు లాల్తూతో ఉంటోందని చెబుతున్నాడు. వీరి కథనాలు విన్న పోలీసులకు బుర్ర తిరిగిపోగా, ‘మీ వాదనలను నిరూపించే చట్టపరమైన ఆధారాలతో రండి’ ఆ ముగ్గుర్నీ ఆదేశించారు. మరి చూడాలి ఎవరి వాదనలో వాస్తవం ఉందో. కానీ మొత్తానికి చాలా సేపు పోలీసులకు బుర్రలు బద్దలైనంత పనిచేశారు ముగ్గురు కలిసి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wife  One wife two Husbands  Jharkhand  

Other Articles