Police torture to married woman in Hyderabad

Police torture to married woman in hyderabad

In Hyderabad, filmnagar, a police behave valugarly with a married woman. She record his conversation in a phone and complained to police.

In Hyderabad, filmnagar, a police behave valugarly with a married woman. She record his conversation in a phone and complained to police.

ఆమెను కాపాడాల్సిన పోలీస్ కన్నేశాడు

Posted: 03/22/2016 11:22 AM IST
Police torture to married woman in hyderabad

కంచే చేను మెయ్యడం అంటే దే. అయ్యా మహా ప్రభో మాకు మీరే న్యాయం చెయ్యాలని వచ్చిన ఓ అబల మీద కన్నేశాడు కన్నింగ్  పోలీస్. తన దీన పరిస్థితిలో కాపాడతారు అనుకున్న ఖాకీనే కాటువేసేందుకు ప్రయత్నించిన ఘటన హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో చోటుచేసుకుంది. ఫిల్మ్ నగర్ లోని దీనదయాళ్ నగర్ కు చెందిన వేముల సరస్వతి అనే వివాహితను ఆమె భర్త తాగి వేధించే వాడు. రోజు ఆమెను చిత్రహింసలు పెట్టినా కూడా భరించింది. కానీ ఓ రాత్రి మాత్రం మరీ దారుణంగా కొడుతుంటే స్థానికంగా ఉన్న పోలీస్ ఔట్ పోస్ట్ కు వెళ్లింది. అక్కడ ఉన్న సురేష్ అనే హోంగార్డుకు మొత్తం విషయం చెప్పింది.

వాళ్ల ఇంటికి చేరుకున్న సురేష్ ఆమె భర్తను చితకొట్టడంతో పాటు అక్కడ వ్యవహారాన్ని సర్దిచెప్పాడు. అయితే తర్వాత రోజు నుండి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఫిర్యాదు చేసిన మేముల సరస్వతి ఫోన్ నెంబర్ ను సంపాదించి ఆమెకు ఫోన్ చెయ్యడం మొదలుపెట్టాడు. రెండు మూడు సార్లు ఆమె ఇంటికి వెళ్లి వేధించాడు. దాంతో ఆమె సురేష్ మాటలను రికార్డు చేసి బంధువులకు వినిపించింది.మరోసారి ఆమె ఇంటికి వచ్చిన సురేష్ ను స్థానికులు అడ్డుకొని చితకబాదారు. సురేష్ మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles