High Tension In HCU

High tension in hcu

HCU, Hyderabad Central University, Rohith Vemula, Appa Rao

High Tension In HCU. Students Vandalise Office As VC Appa Rao Resumes Work, Students attacked on administration office

ITEMVIDEOS: HCU లో ఉద్రిక్తత.. వీసీ అప్పారావును అడ్డుకున్న విద్యార్థులు

Posted: 03/22/2016 12:55 PM IST
High tension in hcu

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో టెన్షన్ కనిపిస్తోంది. వర్సీటీకి చేరుకున్న వీసీ అప్పారావు ను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. రోహిత్‌ ఆత్మహత్య అంశంలో ఆరోపణలు ఎదుర్కొని సెలవుపై వెళ్లిన వీసీ అప్పారావు ఇవాళ తిరిగి బాధ్యతలు స్వీకరించేందుకు యూనివర్శిటీకి వచ్చారు. అప్పారావు రాకను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆయన వాహనంపై విద్యార్థులు దాడి చేశారు. వీసీ కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. ఈ ఘటనతో పోలీసులు వర్శిటీ ప్రాంగణంలో భారీగా మోహరించారు.

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అనే పిహెచ్డీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే అందుకు పరోక్షంగా వీసీ అప్పారావు కారణం అంటూ కొన్ని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆదేవాల మేరకు అప్పారావు నడుచుకుంటున్నారని ఆ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కాగా గత కొంత కాలంగా సద్దుమణిగింది అనుకున్న వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. దాంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మళ్లీ ఏం జరుగుతుందో అని టెన్షన్ వాతావరణం నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HCU  Hyderabad Central University  Rohith Vemula  Appa Rao  

Other Articles