BJP leader Kundanika Sharma arrested in Agra for provocative remarks

Bjp leader arrested for provocative speech gets bail

BJP, Congress, VHP, Kundanika Sharma, provocative speech, VHP leader Arun Mahaur, Arun Mahaur condolence meeting, Meera Hussaini, Agra, Uttar Pradesh, unidentified assailants, protest, Akhilesh Yadav

BJP leader Kundanika Sharma was arrested for allegedly making a provocative speech at the condolence meeting of VHP leader Arun Mahaur.

నోటి దురుసు.. వీహెచ్ పీ మహిళా నేత అరెస్టు..

Posted: 03/22/2016 02:06 PM IST
Bjp leader arrested for provocative speech gets bail

ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ మహిళా నేత నోటి దురుసు అమెను అరెస్టు కారణం అయ్యింది. యూపీలోని ఆగ్రాకు చెందిన కుందానిక శర్మ రెచ్చగోట్టే వ్యాఖ్యలు చేశారన్న అభియోగాల నేపథ్యంలో అమెను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల స్థానిక విశ్వహిందూ పరిషత్ నేత అరుణ్ మహౌర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో ఆతని సంస్మరణ సభకు హజరైన కుందానిక శర్మ.. ఆయనకు సంతాపం తెలిపిన తరువాత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో అమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా అరుణ్ మహౌర్ సంతాప సభలో శర్మ ఉద్రేకపూరిత ప్రసంగం చేశారన్న అియోగాలపై పోలీసులు కేసు నమోదు చేసి అమెను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆగ్రా కోర్టులో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. శర్మకు మద్దతుగా పెద్ద సంఖ్యలో కోర్టుకు తరలివచ్చిన అనుచరులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన పోలీసులు అక్కడ పెద్ద సంఖ్యలో మోహరించారు. బీజేపీ కార్యకర్తల నినాదాలు, పోలీసుల మోహరింపుతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ తరువాత అమెకు న్యాయస్థానం ఆమెకు వచ్చే నెల 2 దాకా మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Congress  VHP  Kundanika Sharma  provocative speech  VHP leader Arun Mahaur  

Other Articles