Hulk Hogan Jury Awards Punitive Damages, Verdict Swells To $140.1 Million

Gawker hit with additional 25m in damages over hulk hogan lawsuit

Gawker Media, Daulerio A J, Denton Nick,Florida jury, Privacy, Hulk Hogan, Terry Bollea, Gawker sex-tape case, wrestler Hulk Hogan, Nick Denton, Terry Bollea,

A Florida jury assessed Gawker Media millions more in punitive damages for having invaded the privacy of the retired wrestler Hulk Hogan, adding to the $115 million it awarded in compensatory damages last week.

పరువు తీసినందుకు మీడియాకు భారీ పరిహారం చెల్లించాలని కోర్టు అదేశం

Posted: 03/22/2016 02:50 PM IST
Gawker hit with additional 25m in damages over hulk hogan lawsuit

స్నేహితుడి భార్యతో ఏకాంతంగా గడిపిన వీడియో టేపుల వ్యవహారంలో తన ప్రమేయం, అనుమతి తీసుకోకుండా ఓ మీడియా సంస్థ దానిని తమ వెబ్ సైట్ లో ప్రదర్శించడం ద్వారా తన పరువు మర్యాదలకు విఘాతం కలిగిందని ప్రముఖ రెజ్లర్ హల్క్ హోగన్ కోర్టులో వేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం అతనికి భారీ పరిహారం అందించాలని తీర్పును అమెరికాలోని ఫ్లోరిడా కోర్టు వెలువరించింది. హాల్క్ హోగన్ కు పరిహారంగా 11.5 కోట్ల డాలర్లను చెల్లించాలని ఇటీవల తీర్పునిచ్చిన అమెరికాలోని ఫ్లోరిడా న్యాయస్థానం శిక్షాత్మక పరిహారంగా మరో 25 మిలియన్ డాలర్లను అదనంగా చెల్లిందాలని కూడా ఇవాళ తీర్పును వెలువరించింది.

వాదోపవాదనలు ప్రారంభమైన ఆరు గంటల్లోపే న్యాయస్థానం ఈ ఆదేశాలు వెలువరించింది. కోర్టు తీర్పుపై అప్పీలు చేస్తామని గాకర్ మీడియా వ్యవస్థాపకుడు నిక్ డెంటన్ ప్రకటించారు. తన మాజీ బెస్ట్ ఫ్రెండ్ భార్యతో హల్క్ హోగన్ ఏకాంతంగా గడిపిన సెక్స్ వీడియోను 2012లో గాకర్ వెబ్ సైట్ పోస్టు చేసింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోను బహిర్గతం చేయడంతో వృతి జీవితానికి నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ గాకర్ మీడియాపై ఆయన పరువునష్టం దావా వేశారు. తనకు జరిగిన నష్టానికి 100 మిలియన్ డాలర్లు పరిహారంగా ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు.

రహస్యంగా వీడియో చిత్రీకరించి, ఇంటర్నెట్ లో పోస్టు చేశారని కోర్టుకు హోగన్ తరపు న్యాయవాది తెలిపారు. గాకర్ మీడియా జర్నలిజం ప్రమాణాలను పాటించలేదని పేర్కొన్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను బహిర్గం చేసే హక్కు  మీడియాకు లేదని వాదించారు. ఈ వీడియోను ఇంటర్నెట్ లో పెట్టే ముందు హోగన్ ను కాని, అతడితో సన్నిహితంగా గడిపిన మహిళను సంప్రదించలేదన్నారు. ఈ వీడియోను చిత్రీకరించిన మహిళ భర్తను సంప్రదించిందని వెల్లడించారు. వాదోపవాదనలు విన్న కోర్టు.. హోగన్ కు 11.5 కోట్ల డాలర్లు చెల్లించాలని గాకర్ మీడియాను ఆదేశించింది. కోర్టు తీర్పుపై హోగన్ హర్షం వ్యక్తం చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles