If kanaiah kumar is a Bhagath Singh then Sonia Gandhi is Bharath Matha

If kanaiah kumar is a bhagath singh then sonia gandhi is bharath matha

Kanaiah Kumar, Bharath matha, Bhagath Singh, Shashi Tharoor, Tharoor, JNU, Delhi, JNU Row, congress, Sonia Gandhi

If kanaiah kumar is a Bhagath Singh then Sonia Gandhi is Bharath Matha. Shashi Tharoor contravesial statements about Bhagath Singh in JNU, Delhi.

కన్హయ కుమార్ భగత్ సింగ్ ఐతే సోనియాగాంధీ భరతమాతనా..?

Posted: 03/22/2016 04:33 PM IST
If kanaiah kumar is a bhagath singh then sonia gandhi is bharath matha

భారతమాత అంటే ఇప్పటికే ఓ వర్గానికి చెందిన వాళ్లు మాత్రమే అన్నట్లు తయారైంది. జాతీయగీతం పాడటం కూడా దేశంలో చాలా మందికి ఇబ్బందిగా మారింది. దేశభక్తి అంటే దేశంలో జోకులా తయారైంది. నిన్న రాత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అపర మేధావి శశిథరూర్ మాటలు విన్నాక.. అసలు ఏమనాలో కూడా అర్థం కాలేదు. దేశంలో ఎంతటి దౌర్భాగ్యం తయారైంది అంటే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా దానికి ప్రతిపక్షాలు మద్దతునిస్తున్నాయి. చివరకు దేశంలో కుక్క మొరిగినా కానీ దేశంలో కుక్కలు కూడా ఆనందంగా లేవు. అందుకే మొరుగుతున్నాయి అంటూ ఛండాలం మాట్లాడుతుంటారు. ఇలా నేను రాస్తే మాత్రం ఖచ్చితంగా మోదీకి మద్దతుగా ఉన్నాడు అని అనుకుంటున్నారేమో..? కానే కాదు కాంగ్రెస్ నాయకుల పరిస్థితిని వివరిస్తున్నా.

దేశం కోసం ప్రాణాలు తీసుకున్న భగత్ సింగ్ లాంటి అమరవీరుడుతో కన్హయ కుమార్ అనే ఓ దేశద్రోహం కేసులోని నిందితుడిని పోల్చడం నిజంగా సిగ్గుచేటు. శశిధరూర్ లాంటి మహా మేధావి ఇలాంటి చెత్త స్టేట్ మెంట్ ఇవ్వడం చాలా దురదృష్టం. కాగా శశిధరూర్ ఇంతకీ ఏం చెప్పాలనుకున్నారు..? కాంగ్రెస్ వర్గాల ఆలోచనా విధానం ఎలా ఉంది అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎర్రపూల వనంలో పూలై పూచిన భగత్ సింగ్, ఉరికంబాన్ని ఎగతాళి చేసి, నిప్పురవ్వల మీద నిదురించిన అమరుడు భగత్ సింగ్.దేశం కోసం తన చదువును, తన పెళ్లిని, తన కుటుంబాన్ని, తన మతాన్ని, తన జీవితాన్ని కూడా వదులుకున్నాడు భగత్ కేవలం దేశం కోసం మాత్రమే జీవించాడు... దేశం కోసమే మరణించాడు.

గొప్ప వ్యక్తిత్వం ఉన్న దేశభక్తుడు భగత్ సింగ్ తో కన్హయ కుమార్ ను పోల్చడం అసలు కలలో కూడా కుదరని పని. కానీ శశిధరూర్ లాంటి మేధావులు మాత్రం ఒక్క మాటతో భగత్ సింగ్ ను, కన్హయ కుమార్ ను సమం చేశాడు. అయినా భగత్ సింగ్, మహాత్మగాంధీ, నెహ్రూలాంటి మహోన్నత వ్యక్తుల పేర్లను తీసుకున్న శశిథరూర్ ఇలా కన్హయ కుమార్ ను భగత్ సింగ్ తో పోల్చడం అస్సలు సమ్మతించాల్సిన అంశంకాదు. పైగా ఆయన గారు మాట్లాడుతూ తాను చెప్పిన మాటల్లో ఎలాంటి తప్పులు లేవని కూడా అన్నారు. భగత్ సింగ్ మీద కూడా 20 ఏళ్లప్పుడే దేశద్రోహం కింద కేసు నమోదైందని.. ఇప్పుడు కన్హయ కుమార్ కూడా అదే కేసు నమోదైందని అందుకే అలా అన్నానని చెప్పుకొచ్చారు. కానీ థరూర్ ఇక్కడ ఓ విషయాన్ని మరిచిపోతున్నారు. మీసాలు పిల్లికి ఉండాయి అలాగే పులి కూడా ఉంటాయి రెండింటికి పెద్దగా తేడా లదు.. మీసాలు ఉంటే చాలు అది పులే అంటే ఎవరైనా ఒప్పుకుంటారా..?

"ఒక మనిషిని మరొకడు దోచుకోవడానికి అవకాశం లేని ఆర్థిక వ్యవస్థను స్థాపించడం కొరకే మేం విప్లవాన్ని సాగిస్తున్నాం" అంటూ యువకులను సమీకరించి బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎదురొడ్డి 24 ఏండ్ల ప్రాయంలోనే తన సహచరులు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లతో 1931 మార్చి 22న బ్రిటీషు ప్రభుత్వంచే... ఉరి తీయబడిన విప్లవ వీరకిశోరం "షహీద్ భగత్ సింగ్". కానీ అలాంటి షమీద్ బగత్ సింగ్ తో కన్హయ కుమార్ ను పోల్చడం ఏమాత్రం సంబందంలేని రెండు విదుద్ద అంశాలు. భగత్ సింగ్ స్వాతంత్ర్య ఉద్యమం చేస్తున్న కాలంలో ఉన్న పరిస్థితులు వేరే ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు భరతమాత స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నాం.. స్వేచ్ఛగా ఏమైనా మాట్లాడుతున్నాం. ఇలాంటి సమయంలో కన్హయ కుమార్ అనే వ్యక్తి దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తిని భగత్ సింగ్ తో ఎలా పోలుస్తారో శశిథరూర్ కే తెలియాలి.

శశిథరూర్ లాంటి మేదావులు కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో ఓ క్లారిటీ మాత్రం వచ్చింది. కాంగ్రెస్ నాయకులు మోదీ సర్కార్ మీద ఎవరు మాట్లాడినా వారిని వాళ్ల కళ్లతో దేశం కోసం త్యాగాలు చేసిన మహానుబావులుగా, గొప్ప దేశభక్తులుగా బిరుదులు ఇస్తోంది. అందుకే కావచ్చు దిల్లీ యూనివర్సిటీ విద్యార్థి కన్హయ కుమార్ కు భగత్ సింగ్ అనే బిరుదును కట్టబెట్టారు. అయితే కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలతో అందరూ ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్ నాయకుల కళ్లకు కన్హయ కుమార్ భగత్ సింగ్ లాగా కనిపిస్తే మరి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు ఎలా కనిపిస్తున్నారు అని బిజెపి నాయకులు ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ నేపథ్యంలో మరోచర్చకూడా సాగుతోంది. కాంగ్రెస్ లో ఏకైక శక్తిగా ఎదిగిన సోనియాగాందీని మరికొద్ది రోజుల్లో భరతమాతగా కాంగ్రెస్ వర్గాలు చిత్రీకరించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని చర్చించుకుంటున్నారు. అయినా పచ్చకామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు.. మోదీని ఎదురిస్తున్న కన్హయ కుమార్ కాంగ్రెస్ కళ్లకు భగత్ సింగ్ లాగా కనిపిస్తున్నాడేమో. కానీ భగత్ సింగ్ పేరుతో కాకుండా వేరే పేర్లతో పిలిచి ఉంటే దేశంలో ఇంత దుమారం జరిగి ఉండేది కాదేమో. భగత్ సింగ్ లాంటి మహోన్నత దేశభక్తుడితో కన్హయ కుమార్ ను పోల్చి శశి ధరూర్ తన పరువు తానే తీసుకున్నాడని అనుకుంటున్నా. ఎందుకంటే నిన్నటి దాకా వశిథరూర్ అంటే ఎక్కడో ఓ గౌరవం ఉండేది.. కానీ దేశానికి ఆజాదీ కోసం పోరాడిన భగత్ సింగ్ లాంటి వ్యక్తి కీర్తిపతాకంలో మాయని మచ్చ వేసిన శశిథరూర్ అంటే గౌరవం సంగతి దేవుడెరుగు.. అసహ్యం కలుగుతోంది.

-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanaiah Kumar  Bharath matha  Bhagath Singh  Shashi Tharoor  Tharoor  JNU  Delhi  JNU Row  congress  Sonia Gandhi  

Other Articles