Sensex closes at over 2-month high, Nifty above 7,600

Sensex soars 275 points to hit 2 mth high logs 3rd weekly rise

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

Indian stocks capped a third week of gain as risk appetite returned to developing markets after global central banks indicated a willingness to continue measures to support growth

నష్టాల్లో మార్కెట్లు.. 7500 మార్కుకు దిగువన నిఫ్టీ

Posted: 03/18/2016 06:35 PM IST
Sensex soars 275 points to hit 2 mth high logs 3rd weekly rise

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలను గడించాయి. వరుసగా మూడో వారంతంలో లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు.. రెండు నెలల గరిష్టస్జాయికి చేరుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సవరించకుండా తీసుకున్న నిర్ణయం ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కొనసాగించింది. అదే ధోరణిలో భారత మార్కెట్ కూడా కొనసాగింది. సెషన్ ఆరంభం నుంచి లాభాల్లో ఉన్న సూచికలు, చివరి గంట వ్యవధిలో దూసుకెళ్లాయి. యూరప్ మార్కెట్లలో నూతన కొనుగోళ్లు వెల్లువెత్తడంలో ఆ ప్రభావం భారత మార్కెట్లోకి ఎఫ్ఐఐలు మరిన్ని పెట్టుబడులను తీసుకు వచ్చేలా చేసింది.

ఇవాళ ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 275.37 పాయింట్లు పెరిగి 1.12 శాతం లాభంతో 24,952.74 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 91.80 పాయింట్లు పెరిగి 1.22 శాతం లాభంతో 7,604.35 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.66 శాతం, స్మాల్ క్యాప్ 0.61 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 44 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. వీఈడీఎల్, హిందాల్కో, ఏసీసీ, బోష్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ తదితర కంపెనీలు లాభపడగా, లుపిన్, సన్ ఫార్మా, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, హిందుస్థాన్ యూనీలివర్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,788 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,294 కంపెనీలు లాభాల్లోను, 1,312 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 92,76,638 కోట్లుగా నమోదైంది.    

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles