వీడియో కాన్ సంస్థ పొందిన రుణాల వివాదంలో చిక్కుకున్న ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. తన భర్తకు చెందిన సంస్థల్లో వీడియోకాన్ సంస్థ పెట్టుబడులు పెట్టడంతో క్విడ్ ప్రోకో కింద అమె వీడియోకాన్ సంస్థకు రుణాలను అందించారన్న అరోపణలకు బలం చేకూరింది. ఓ అజ్ఞత అవినీతి వ్యతిరేక సామాజిక కార్యకర్త ద్వారా ఈ పూర్తి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే చందా కొచ్చర్ ముందున్న ప్రత్యామ్నాయాలలో అమె తన పదవికి రాజీనామా చేసి తప్పుకుంటారని కూడా కథనాలు వచ్చాయి. అయితే అమెకు బ్యాంకు బోర్డు నుంచి మద్దతు లభించడంలో అమె తప్పుకోవాల్సిన అవసరం రాలేదు.
కాగా ఇప్పుడా పరిణమాలు శరవేగంగా మారుతుతున్నాయి. దీంతో నిన్నమొన్నటి వరకు చందా కొచ్చర్‌ను వెనకేసుకొచ్చిన ఐసీఐసీఐ బోర్డు... ఇప్పుడు ఆమెను నిరవధిక సెలవుపై వెళ్లాలని ఆదేశించినట్టు సమాచారం. వార్షిక సెలవులకు వెళ్తున్నట్టు పైకి చెబుతున్నా... చందా కొచ్చర్ లాంగ్ లీవ్ తీసుకోవడానికి వీడియోన్ కాన్ వివాదమే కారణంగా తెలుస్తోంది. వీడియోన్ కాన్ వివాదం, చందా కొచ్చర్ పాత్రపై స్వతంత్ర విచారణకు ఆదేశించిన ఐసీఐసీఐ బ్యాంక్... దర్యాప్తు పూర్తి అయ్యే వరకు లీవ్‌లో ఉండాలని కొచ్చర్‌ను ఆదేశించింది.
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ ఆధ్వర్యంలో స్వతంత్ర విచారణ చేపట్టాలని బోర్డు నిర్ణయించింది. వచ్చేవారం దర్యాప్తు ప్రారంభించి... రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని బోర్డు దర్యాప్తు బృందానికి సూచించినట్టు సమాచారం. భర్త దీపక్ కొచ్చర్‌కు మేలు చేసేందుకు చందా కొచ్చర్... వీడియోకాన్‌కు రుణాలు మంజూరు చేయడంలో క్విడ్ ప్రోకోకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2016లోనే చందా కొచ్చర్‌పై ఆరోపణలు వచ్చినా అంతర్గత విచారణ తర్వాత బోర్డు చందా కొచ్చర్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది.
వీడియోకాన్ కేసులో బ్యాంక్ స్వతంత్ర అంతర్గత దర్యాప్తు ముగిసే వరకూ కొన్ని రోజులు ఐసీఐసీఐ బ్యాంక్ చందా కొచ్చర్ ను సెలవులపై వెళ్లిపోవాలని బ్యాంక్ ఉద్యోగులు కోరినట్లు వస్తున్న వార్తలను బ్యాంకు యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. లీప్ పై వెళ్లాలని అమె ముందుగానే నిర్ణయించారని బ్యాంకు తెలిపింది. అందువల్లే ఆమె లీవ్ లో ఉన్నరని, తాము సెలవులు తీసుకోమని కొచ్చర్ ను కోరినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపింది. ఇక అమె స్థానంలో వారసుడిని వెతికేందుకు బ్యాంక్ బోర్డు ఓ సెర్చ్ కమీటీని నియవించారన్న వార్తలను కూడా బ్యాంక్ ఖండించింది.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more