Tdp mla yanamala fire on ys jagan

tdp mla yanamala fire on ys jagan, Tdp Yanamala Ramakrishna Fire On Jagan, tdp, ysrcp, minister tg venkatesh, cm kiran kumar reddy, samaikyandhra,

tdp mla yanamala fire on ys jagan, Tdp Yanamala Ramakrishna Fire On Jagan

జగన్ పై యనమల పైర్- మంత్రి టీజీ హెచ్చరిక

Posted: 11/21/2013 07:37 PM IST
Tdp mla yanamala fire on ys jagan

జగన్ దేశ పర్యటన సమైక్యం కోసం కాదు...ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసమే అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈరోజు మాట్లాడుతూ ఎస్పీ, టీఎంసీ పార్టీలు చిన్నరాష్ట్రాలకు వ్యతిరేకమని, అలాంటప్పుడు జగన్ వెళ్లి వాళ్లను ఒప్పించేదేమీ లేదని ఆయన అన్నారు. ములాయంను కలవబోతున్న జగన్ మాయావతిని ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు.

 

సోనియాతో శాశ్వత ఒప్పందం, తన లూటీకి మిగిలిన పార్టీల ఆమోదమే జగన్ ఎజెండా అని విమర్శించారు. సూట్‌కేసు కంపెనీలకు కలకత్తానే కేంద్రమన్నారు. జగన్ విషయంలో రాజకీయ పార్టీలు, కోర్టులు అప్రమత్తంగా ఉంచాలని హెచ్చరించారు. విభజనపై సీఎం కిరణ్ సుప్రీంలో కేసు వేస్తారా లేదా చూడాలని యనమల పేర్కొన్నారు.

 

రద్దు చేయాలి : టీజీ

తెలంగాణ బిల్లు కంటే ముందే అసెంబ్లీని రద్దు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరినట్లు మంత్రి టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని న్యాయనిపుణులతో కూడా చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన మాట్లాడుతూ సమైక్యవాడం ముసుగులో నిజమైన సమైక్యవాదులను టార్గెట్ చేస్తున్నారని, విభజన జరిగిన తర్వాత సమైక్యం పేరుతో కొత్త పార్టీ పెట్టినా ప్రయోజనం లేదని టీజీ వ్యాఖ్యానించారు.

 

రాష్ట్రానికి వచ్చే ముసాయిదా బిల్లులో రాయల తెలంగాణపై అభిప్రాయం కోరే అంశం ఉంటుందని, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మున్సిపల్ కార్పొరేటర్లు, సర్పంచ్లతో చర్చలు జరుపుతామన్నారు. ఆ తర్వాతే అంతిమ నిర్ణయానికి వస్తామని టీజీ తెలిపారు. ఏపీ ఎన్జీవోల ఛలో ఢిల్లీకి తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more