ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. అది ముగియముందే టీమిండియా మహిళల జట్టు వికెట్ కీపర్ తానియా భాటియాకు చేదు అనుభవం ఎదురైంది. తనకు కేటాయించిన హోటల్ గదిలో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి నగదు, కార్డులు, నగలు, విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్ ను దొంగలించారు. దీంతో అమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా మహిళల జట్టు అతిథ్యజట్టును క్లీన్ స్వీప్ చేసి.. వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్నా.. ఆ ఆనందం మాత్రం నిలవనీయకుండా చేసింది. మ్యాచ్ సందర్భంగా భారత మహిళల జట్టు లండన్ లోని మారియట్ హోటల్ లో బస చేసింది. ఈ సందర్భంగా తానియా భాటియా బ్యాగ్ కనిపించకుండా పోయింది. ఆ బ్యాగులో నగదు, కార్డులు, వాచీలు, నగలు ఉన్నాయని తానియా భాటియా వాపోయింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు హోటల్ భాగస్వామిగా ఉన్న మారియట్ హోటల్ లో ఇలాంటి ఘటన జరగడం దిగ్భ్రాంతికి గురిచేసిందని అమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటనతో తీవ్ర నిరాశకు గురయ్యానని తెలిపింది.
తన గదిలోకి ఎవరో వచ్చారని, వారే తన బ్యాగ్ చోరీ చేసి ఉంటారని తానియా పేర్కొంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భాగస్వామ్య హోటల్ లో ఈ విధమైన భద్రతా వైఫల్యం విస్మయానికి గురిచేస్తోందని వెల్లడించింది. ఈ ఘటనపై త్వరితగతిన విచారణ చేపట్టి.. దొంగతనం వ్యవహారంలో దొషులను పట్టుకోవాల్సిందిగా అమె కొరింది. కాగా, ఈ ఘటనపై లండన్ లోని మారియట్ హోటల్ స్పందించింది. టీమిండియా మహిళా క్రికెటర్ తానియాకు క్షమాపణలు తెలియజేసింది. అయితే ఏ తేదీల్లో తమ హోటల్ లో బస చేసిందో ఆ వివరాలను పంపిస్తే ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more
Sep 17 | ఆటగాడిగా భారత్ కు ఎన్నో విజయాలను అందించిన రవిశాస్త్రి... హెడ్ కోచ్ గా కూడా టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. రవిశాస్త్రి హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు విదేశాల్లో మన జట్టు చిరస్మరణీయమైన విజయాలను... Read more