Bhumana innovative protest misuse of ttd funds for officials cars

Bhumana innovative Protest, Misuse of TTD Funds for Officials Cars, TTD officers, samaikyandhra, mla bhumana karunakar reddy,

Bhumana innovative Protest, Misuse of TTD Funds for Officials Cars

శ్రీవారి సొమ్ము-ఎమ్మెల్యే గొర్రెలను

Posted: 11/01/2013 07:47 PM IST
Bhumana innovative protest misuse of ttd funds for officials cars

భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీవారికి సమర్పించే కార్లను టిటిడి ట్రస్టు తన సొంత అవసరాలకు విరివిగా ఉపయోగిస్తూ, అవి నడపడానికి అవసరమయ్యే చమురు ఖర్చును శ్రీవారి నిధుల నుంచే ఖర్చు చేస్తోంది. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు ఇలా టిటిడి అధికారులు సద్వినియోగం చేస్తున్నారు. వాస్తవానికి ఈ వాహనాలను దేవస్థానానికి అవసరమైన సరుకులు తేవడానికి, నడవలేని భక్తులను వారి గమ్యాలకు చేరవేయడానికి ఉపయోగించాలి.

 

కానీ జరుగుతున్నది అది కాదు. ఈ కార్లలో ఉన్నతాధికారులు తిరగడానికి, ఉద్యోగులు తమ సొంతపనుల కోసం తిరగడానికి వాడడం మంచిది కాదు. శ్రీవారి సేవ చేస్తున్న దేవస్థానం ఉద్యోగులు, అధికారులు ఇలా ఒకరేమిటి, దేవస్థానంతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరూ ఈ కార్లను ఉపయోగించడం ఆనవాయితీగా మారింది. తిరుమలేశుడు బ్రహ్మోత్సవాల్లో మాత్రమే తొమ్మిది వాహనాల్లో ఊరేగుతాడు. అవీ అనాదిగా వస్తున్న తన పాతవాహనాలపైనే. అంతటి వడ్డీకాసులవాడే ఖర్చు తగ్గించుకుంటుంటే అధికారులు మాత్రం ఆయన పేరు చెప్పుకొని రోజుకో కొత్త వాహనంలో ఊరేగుతున్నారు.

 

ఈ మధ్య అలాంటి ఇలాంటి కానుకలు కావు బ్రాండ్ల కార్లే బహుమతులుగా వస్తున్నాయి. ఇవన్నీ ట్రాన్స్‌పోర్ట్‌ రవాణా విభాగం ఆధీనంలోకి వస్తాయి. వీటిని వాడకుండా వదిలేస్తే చెడిపోతాయని జీఎం కొత్త కార్లను కూడా మిగతా అధికారుల అవసరాలకు కేటాయిస్తున్నారు. ఈవిషయంలో జీఎం పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో ప్రశ్నించిన అధికారులందరీ టీటీడీ వాహనాలను ఇవ్వడం మొదలుపెట్టారు.

 

అధికారులందరికీ వాహనాలు కేటాయించడంతో కొరత ఏర్పడింది. ఉన్నవి సరిపోవడం లేదంటూ వందకుపైగా అద్దె వాహనాలను తీసుకున్నారు. ఇప్పటికే టీటీడీలో అన్ని రకాల వాహనాలు కలుపుకుంటే 300లకు పైగా ఉన్నాయి. యధేచ్ఛగా అన్ని విభాగాల్లోనే అధికారులు వాహనాలను ఉపయోగిస్తున్నారు. పని ఉన్నా లేకున్నా సొంత పనులకు కూడా వాడుతున్నారు. కార్ల చమురుకయ్యే ఖర్చులన్నీ శ్రీవారి ఖజానా నుంచే ఖర్చు పెడుతున్నారు. చివరకు ఏడుకొండల వాడి సంపద అధికారుల విలాసాల పాలవుతోంది.

 

ఆపదమొక్కుల వాడని, అనాథరక్షకుడని పేరుగడించిన శ్రీనివాసుని సన్నిధిలో ఆయన దర్శనార్థం వచ్చే భక్తులు మాత్రం ఎన్నో ఇక్కట్లకు లోనవుతున్నా, టిటిడి యాజమాన్యానికి పట్టవు. ఇప్పటికైనా టిటిడి అధికారులు భక్తుల పట్ల కనీస సానుభూతితో నైనా ఈ కార్లను వారికి ఉపయోగకరంగా వాడి భక్తులకు సౌకర్యాన్ని కలిగించాలని భక్తులు కోరుతున్నారు. ఎందుకంటే భక్తులు లేకుంటే భగవంతుడు లేడనే విషయాన్ని టిటిడి అధికారులు ఎంత త్వరగా తెలుసుకుంటే అంతమంచిది.

 

గొర్రెలను మేపిన ఎమ్మెల్యే భూమన..

రాష్ట్రాన్ని విడగొట్టవద్దంటూ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. తిరుపతిలో శుక్రవారం స్కాలర్ కోర్టు వేసుకుని గొర్రెలను మేపుతూ ఆయన నిరసన తెలిపారు. రాష్ట్ర విభజన జరిగితే పట్టభద్రులు గొర్రెలు మేపాల్సి వస్తుందని నినాదాలు చేశారు. జై సమైక్యాంధ్ర అంటూ గళం విప్పారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles