తాతా తాతా సూది దొరికిందన్నాట్ట. ఏదిరా అని తాత అడిగితే పోయింది అన్నాడట ఆ మనవడు. నీట్ మీద ఇంకా స్పష్టత రాలేదు. ఎంసెట్ కి బదులు మెడిసన్ చేయగోరే విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్షలకు హాజరవాల్సి ఉంటుందన్న ప్రకటన మీద విద్యార్థులంతా నిరాశలో కొట్టుమిట్టాడుతుండగా మహారాష్ట్ర ప్రభుత్వం దానిమీద సుప్రీం కోర్టుకి వెళ్ళింది. అదే సమయంలో మనవాళ్ళు కూడా సుప్రీం కోర్టుకెళ్తామని ఊగిసలాడారు. టైం సరిపోతుందని, ప్రశ్నా పత్రాలు తెలుగులో ఉంటాయనే హామీలను గులామ్ నబీ ఆజాద్ ఇచ్చినా, మన రాష్ట్రంలోని విద్యార్థులు ఆందోళన పడటం మొదలుపెట్టారు. ఇంతలో సుప్రీం కోర్టుకి కాకుండా రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళమని సూచించగా మహారాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుని ఆశ్రయించింది. మన ప్రభుత్వం కూడా అలాగే హైకోర్టుకి వెళ్ళకుండా, నీట్ ని రెండు సంవత్సరాలు వాయిదా వేసారని గులామ్ నబీ ఆజాద్ చెప్పారని ముఖ్యమంత్రి ప్రకటించటం, వాయిదా పడటానికి కారణం ముఖ్యమంత్రి చొరవే నని పురంధేశ్వరి, ఇతర మంత్రులు పొగడం జరిగింది కానీ, ఇంతా చేసి అలాంటివేమీ జరగలేదని నిన్న కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి గులామ్ నబీ ఆజాద్ లేఖతో తేలిపోయింది.
నీట్ మీద మీ అభ్యంతరాలేమిటో చెప్తే, వాటిని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్తమని ఆ లేఖ సారాంశం. సుప్రీం కోర్టుకి వెళ్ళాలా అంటే మరి మహారాష్ట్ర విషయంలో హైకోర్టుకి వెళ్ళమని సూచించటం జరిగింది కదా ఇప్పుడు మళ్ళీ మన రాష్ట్రం వచ్చేటప్పటికి నీట్ ని వాయిదా వెయ్యటానికి సుప్రీం కోర్టు ఆమోదం అవసరమా అంటే అవునేమో మరి. మొత్తం మీద నీట్ విషయం నీట్ గా లేదు. విద్యార్థలు, వారి తల్లిదండ్రులూ అసంతృప్తి, ఆందోళనలకు గురౌతున్నారు. గులామ్ నబీ ఆజాద్ చెప్పారని సంబరపడకుండా లిఖిత పూర్వకంగా తీసుకుంటే బాగుండేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలోనూ, రాష్టంలోనూ ఒక పార్టీ అధికారం లో ఉన్నప్పుడు అలా ఖరాఖండిగా అడిగి తీసుకోవటం కష్టమౌతుందేమో.
శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more