Black cat gets owner of 82 crores

black cat gets owner of 82 crores, tomsino, cat, milienar, Assumpta est Maria,94 year old woman assumpta maria in italy

black cat gets owner of 82 crores

black cat.GIF

Posted: 12/12/2011 01:22 PM IST
Black cat gets owner of 82 crores

black cat gets owner of 82 crores

నిన్న మొన్నటి వరకు అది మాములుగా ఇంట్లో పెరిగిన పిల్లే.. కానీ ఇప్పుడు అది దాదాపు 82 కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు అధిపతి. ప్రపం చంలోనే మూడో సంపన్న పెంపుడు జంతువు. అయినా పిల్లేంటి ఇంతటి సంప దకు యజమానేంటీ అని ఆశ్చర్యపోతున్నారా... అదేంటో తెలియాలంటే ఈ కథ నం చదవాల్సిందే... ఇటలీకి చెందిన మిలియనీర్‌ మారియా అస్సుంటాకు పిల్లు లంటే ప్రాణం. జంతు ప్రేమికురాలైన ఆమె టోమస్సినో అనే పిల్లిని ప్రేమగా పెంచుకుంది. కొన్ని రోజుల తర్వాత అది తప్పిపోయి మళ్లీ దొరికింది. 

దీంతో ఆ పిల్లిపై మరింత ప్రేమను పెంచుకుందామె. అయితే నా అన్న వాళ్లు ఎవరూ లేని అస్సుంటా.. తన మరణానంతరం యావత్తు ఆస్తినీ తాను ఎంతో ప్రేమగా పెంచు కున్న పిల్లికి చెందాలంటూ రెండేళ్ల క్రితం వీలునామా రాసింది. దేశవ్యాప్తంగా విలువైన భవనాలు, కోట్లు విలువ చేసే విల్లాలు, పెద్ద మొత్తంలో బ్యాంకు బ్యాలెన్స్‌, షేర్లు, కోట్ల రూపాయల ఆస్తితో శ్రీమంతురాలైన 94 ఏళ్ల అస్సుంటా గత నెలలో చనిపోయింది. మరణానికి ముందు ఆమె రాసిన వీలునామా ప్రకారం అస్సుంటా యావదాస్తి తన గారాల మార్జాలానికి చెందుతుందని ఆమె తరపు లాయర్లు అన్నా ఒరిచ్చినో, కాంజినోవా ప్రకటించిన ట్లు డెయిలీ ప్రచురించింది. 

అయితే ఇటలీ చట్టాల ప్రకారం వారసులుగా ప్రకటించిన జంతువులకు నేరుగా ఆస్తిని వర్తింపజేయడం కుదరదు. దీంతో అస్సుంటా తన వీలునామాలో ఏదైనా మంచి యానిమల్‌ అసోసియేషన్‌కు ఆిస్తిని అప్పగించాలని కోరింది. అస్సుంటా మరణాంతరం ఆమె లాయర్లు మంచి జంతు సంరక్షణ సంస్థ కోసం ప్రయ త్నించారు. కానీ నిష్పాక్షిక యానిమల్‌ అసోసియేషన్‌ ఏదీ దొరక్కపోవడంతో అస్సుంటాకు వ్యక్తిగత నర్సుగా పనిచేసి న స్టెఫినాకు ఆస్తిని అప్పగించాలని లాయర్లు నిర్ణయించారు. స్టెఫీనా మంచి జంతుప్రేమికురాలు. స్టెఫీనాకు పిల్లులం టే చాలా ఇష్టమని, అంతే కాకుండా తనను చాలా బాగా చూసుకునేదని అస్సుంటా తరచూ తన లాయర్లతో చెబు తుండేది. దీంతో అస్సుంటా ఆస్తితో పాటు పిల్లి టొమస్సినోను స్టెఫీనాకు అప్పగించడమే కరెక్టని లాయర్లు భావిస్తు న్నారు. ఇక గుంటెర్‌ అనే జర్మన్‌ షెప్పర్డ్‌ శునకం దాదాపు దాదాపు 700 కోట్ల ఆస్తితో ప్రపంచంలోనే సంపన్న జంతువుగా పేరొందింది.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Soon tv that can be carried in pocket
Digital film festival in christmas holidays  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles