భగవద్గీత అనువాదం పై నిషేదం విదించాలంటూ దాఖలైన పిటిషన్ ను రష్యా న్యాయస్తానం తిరస్కరించింది. రష్యాలో భగవద్గీత పై నిషేధం విధించాలనే డిమాండ్ కొన్ని నెలల క్రితం తెర పైకి వచ్చింది. దీని వలన భారత్ – రష్యా సంబంధాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్న వారికి కోర్టు తాజా నిర్ణయం ఉరట కలిగించింది. భగవద్గీత సగర్వంగా విజయం సాధించింది. అంతర్జాతీయ వేదికపై తన పవిత్రతను మరోమారు రుజువు చేసుకుంది. పవిత్ర గీతను ఉగ్రవాద సాహిత్యంగా పరిగణిస్తూ దాన్ని నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను రష్యన్ కోర్టు కొట్టేసింది. దీంతో కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా హిందువులలో నెలకొన్న ఉద్రిక్తత సడలింది. టామ్స్క్ నగరంలోని కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసిందని మాస్కో ఇస్కాన్‌కు చెందిన సాధుప్రియదాస్ తెలిపారు. ఇంతకుముందు దిగువ కోర్టు కూడా ఇదే తరహా తీర్పును ఇవ్వగా, అక్కడి న్యాయవాదులు సవాల్ చేశారు.
అక్కడా వారికి చుక్కెదురైంది. ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద రచించిన 'భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్' గ్రంధం పూర్తిగా విద్వేషపూరితంగా ఉందని, హిందూమతాన్ని ఆచరించనివారిని అవమానిస్తోందని పేర్కొంటూ దాన్ని నిషేధించాలని వారు పిటిషన్ దాఖలుచేశారు. దిగువకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించినట్లు దాస్ తెలిపారు.
కోర్టు నిర్ణయాన్ని రష్యాలో భారత రాయబారి అజయ్ మల్హోత్రా కూడా స్వాగతించారు. తీర్పు వెలువడిన అనంతరం ఇస్కాన్ కోర్టు ప్రతినిధి అలెగ్జాండర్ షకొవ్ కూడా, "ఇది పూర్తి న్యాయం, అర్ధవంతం.. ఇంకా ముఖ్యంగా సమంజసమైన నిర్ణయం'' అని వ్యాఖ్యానించారు. దేశంలో ఇస్కాన్ మీడియా కమ్యూనికేషన్ డైరెక్టర్ బ్రజేం ద్ర నందన్దాస్ కూడా తీర్పుపై సంతషం వ్యక్తం చేశారు. "మ నం గెలిచాం. పుస్తకాన్ని నిషేధించాలన్న పిటిషన్‌ను రద్దు చేశారు'' అని తెలిపారు. భగవద్గీతను రష్యాలో తొలిసారిగా 1788లో ప్రచురించారు. తర్వాత అనేక సార్లు పలు అనువాదాల్లో ప్రచురితమైంది
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more