ఎండకాలం .. ముఖ్యంగా వాటర్ భయం పట్టుకుంటుంది. ఈ సమస్య ఒకరిది కాదు.. ఒక దేశానిది కాదు.. యావత్తు ప్రపంచ మొత్తం ఈ సమస్యపై పోరాటం చేస్తునే ఉంది. భూమిలో వాటర్ నిల్వలు ఇంకిపోతున్నాయి. వర్షం ద్వార వచ్చిన నీటిని మనం కాపాడుకోలేకపోతున్నాం. వర్షం వాటర్ అంత సముద్రంలో కలుస్తుంది. ఇక వాటర్ సమస్య నుండి బయటపడటానికి కొత్త ఉపాయం ఆలోచించారు.
టాయిలెట్ నీళ్లను తాగే రోజులు దగ్గరపడ్డాయ్! కంగారుపడకండి.. వాటిని వందశాతం స్వచ్ఛమైన తాగునీరుగా మార్చిన తర్వాతే లెండి! అవును.. ఈ కొత్త టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన నమూనా కూడా మరో ఏడాదిలో సిద్ధంకానుంది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అందిస్తున్న నిధులతో మాంచెస్టర్ యూనివర్సిటీ దీన్ని అభివృద్ధి పరుస్తోంది.
టాయిలెట్ల నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసి తాగునీరుగా మార్చే టెక్నాలజీని 2013కల్లా ప్రదర్శించి చూపడానికి నానోటెక్నాలజీ నిపుణులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 'మేం రూపొందించే పరికరంలో బ్యాక్టీరియా, సూక్ష్మ నానో కణాల మిశ్రమం ఉంటుంది. ఇది నీటిలోని హైడ్రోజన్‌ను గ్రహించి, మిగిలినదాన్ని వడపోసి శుద్ధమైన నీటిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో వెలువడే హైడ్రోజన్‌ను రాకెట్ ఇంధనంగా కూడా మార్చుతుంది.' అని ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్న పరిశోధకులు వివరించారు.
దీనివల్ల అనేక దేశాల్లో తీవ్ర నీటి ఎద్దడితో అలమటిస్తున్న కోట్టాది ప్రజలకు మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శుద్ధమైన నీరు లేక జీవన్మరణ సమస్య ఎదురవుతున్న ప్రాంతాల్లో ఇది మార్పు తీసుకొస్తుందన్నారు. సుమారు రెండు వేల ప్రతిపాదనల్లో నుంచి ఉత్తమమైనదిగా ఎంపికైన ఈ ప్రాజెక్టుకు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి తొలి విడతగా లక్ష డాలర్ల సాయం అందింది. తమ ప్రతిపాదన పనిచేస్తుందని వచ్చే ఏడాదిలోగా నిరూపిస్తే గేట్స్ ఫౌండేషన్ నుంచి ఈ పరిశోధక బృందానికి మరో పది లక్షల డాలర్లు అందుతాయి. దీంతో ప్రకృతి వ్యర్థాలను విలువైన వనరుగా మార్చే టెక్నాలజీని అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ఆ బృందం తమ పనిలో నిమగ్నమైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more