Birthday bash was cover for love trade racket

Birthday bash was cover for love trade racket,Mumbai news, love racket in garb of party

Birthday bash was cover for love trade racket

Birthday.gif

Posted: 06/07/2012 11:57 AM IST
Birthday bash was cover for love trade racket

Birthday bash was cover for love trade racket

అదనంగా సంపాదించుకోవాలనుకుంటే మా పార్టీకి రండి! అంటూ అమ్మాయిలకు మెసేజీలు పంపుతారు. డబ్బు కోసం అనేక మంది అక్కడికి వెళతారు. ఆలోగా ధనిక కుటుంబాలకు చెందిన అబ్బాయిలనూ పిలుస్తారు. అందరికీ మందు పోస్తారు. అదే మత్తులో పరిచయాలు పూర్తయి పార్టీకి వచ్చిన వారంతా జంటలుగా మారతారు. ఇక ఆ రాత్రి గడపడానికి తమకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లిపోతారు. ఇది ముంబై మహానగరంలో కొత్తగా నడుస్తున్న వ్యభిచార ట్రెండ్. ఇక్కడి మసాలా కర్రీ రెస్టారెంట్‌లో అనైతిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కస్టమర్లుగా వెళ్లారు. దీంతో ఈ బాగోతం బయటపడింది. ఉత్తుత్తి పుట్టినరోజు పార్టీలు నిర్వహించి అమ్మాయిలు, అబ్బాయిలను ఆహ్వానించడం.. వారి మధ్య బేరం కుదర్చడం ఈ రెస్టారెంట్ చేస్తున్న పని. పార్టీలోకి అమ్మాయిలను ఉచితంగా అనుమతిస్తారు. అబ్బాయిల నుంచి మాత్రం మూడు వేల చొప్పున వసూలు చేస్తారు. ఈ వ్యవహారాన్ని నిర్ధారించుకున్న పోలీసులు రెస్టారెంట్‌పై దాడి చేసి 15మందిని అరెస్ట్ చేశారు. వీరిలో పార్టీ నిర్వాహకుడు, రెస్టారెంట్ యజమాని, మేనేజర్ సహా 11మంది అమ్మాయిలు ఉన్నారు. చేతి ఖర్చుల కోసం కాలేజీ యువతులు, గృహిణులు ఇలాంటి పార్టీల వలలో చిక్కుతున్నారని పోలీసులు తెలిపారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న రెస్టారెంట్‌పై చర్యలు తీసుకుంటామన్నారు.

Birthday bash was cover for love trade racket

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ed to interrogate ysjagan in delhi
All government websites to move to ipv6 by year end  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles