Sand mafia threatens tdp mla dayakar reddy

Sand mafia threatens TDP MLA Dayakar Reddy,devarakadra sand mafia, mahabubnagar sand mafia, mla dayakar reddy, police devarakadra,

Sand mafia threatens TDP MLA Dayakar Reddy

mafia.gif

Posted: 07/13/2012 03:41 PM IST
Sand mafia threatens tdp mla dayakar reddy

 Sand mafia threatens TDP MLA Dayakar Reddy

ఒక సాధారణ వ్యక్తిని ఒక రౌడీ షీటర్ బెదిరించాడటం వరకు మనకు తెలుసు. కానీ ఒక రౌడీ షీటర్  ఒక ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం ఇదే మొదటిసారి.  జిల్లాకు చెందిన మక్తల్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దయాకర్ రెడ్డిపై ఇసుక మాఫియా దాడి చేసేందుకు ప్రయత్నాలు చేసింది. ఇసుక మాఫియాను అడ్డుకోబోయిన ఎమ్మెల్యేపై వారు దాడి చేశారు. ఈ సంఘటనకు నిర్ఘాంత పోయిన ఎమ్మెల్యే ఆ తర్వాత దేవరకద్ర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  జిల్లాలో ఇసుక మాఫియా విషయాన్ని తాను స్పీకర్ నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టవలసి ఉందని చెప్పారు. ఉదయం కర్నాటక వైపు నుండి వస్తున్న రెండు లారీలను ఎమ్మెల్యే తనిఖీ చేసే ప్రయత్నాలు చేశారు. అందులో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని భావించారు. అయితే దయాకర్ రెడ్డి ఎమ్మెల్యే అని తెలియని ఇసుక మాఫియా ఆయనపై దాడి చేసే ప్రయత్నాలు చేసింది. ఆయనపై బెదిరింపులకు దిగింది.

mafia

దయాకర్ రెడ్డి అనుచర వర్గం వెంటనే స్పందించింది. ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు కలుగ జేసుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇసుక మాఫియా ఏకంగా ఎమ్మెల్యే పైనే బెదిరింపులకు పాల్పడటం చర్చనీయాంశమైంది. దీంతో రెచ్చిపోయిన ఇసుక మాఫియా దయాకర్ పై  దాడికి దిగింది.  మమ్మల్లే అడ్డుకుంటావా అంటూ నెట్టేసారు.  అంతేకాకుండా  మేమంతా  లంబాడీ  వాళ్లమని తమ జోలికి వస్తే ఎస్సీ.. ఎస్టీ యాక్ట్ పెట్టి  బొక్కొలో తోయిస్తామని  వార్నింగ్ ఇచ్చారు.   అంతటితో  ఆగలేదు  ఇసుక మాఫియా  మాటల తూటాలు పేల్చుతూ .. నువ్వు హైదరాబా్ వెళ్లే లోపు  చంపేస్తామంటూ  బెదిరించారని  ఎమ్మెల్యే అంటున్నారు.ఈ సంఘటనతో ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నట్లుగా అర్థమవుతోందని అంటున్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది అంటన్నారు. రవాణాను అడ్డుకున్న వారిపై పథకం ప్రకారం మాఫియా దాడి చేస్తోందని అంటున్నారు. ఈరోజు కూడా ఎమ్మెల్యేపై ఆయన ఎవరో తెలియక అలాగే దాడి చేశారని అంటున్నారు. కాగా ఇసుక మాఫియాపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fire accident in new jersey
Gujarat minister weighed in blood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles