Cmk reddy minority language in tamil nadu

cmk reddy Minority language in tamil nadu

cmk reddy Minority language in tamil nadu

language.gif

Posted: 07/25/2012 12:59 PM IST
Cmk reddy minority language in tamil nadu

cmk reddy Minority language  in tamil nadu

మైనారిటీ భాషా ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న 'సవతి తల్లి' ప్రేమను నిరసించేందుకు సదవకాశం వచ్చింది. తమ నిరసనను పోస్టు కార్డుపై రాసి సీఎంకు పంపాలని రాష్ట్ర మైనారిటీ భాషా సమితి (ఎల్ఐఎంఎఫ్ఓటీ) పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ భాషాప్రజల పట్ల నిర్లక్షంగా వ్యవహరించడంపై రాష్ట్ర మైనారిటీ భాషా సమితి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు సమితి అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.  తమిళనాడులోని తమిళేతర భాషా ప్రజల పట్ల ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నట్టు సమితి నాటి కార్యవర్గ సమావేశంలో అభిప్రాయపడినట్టు డాక్టర్ సీఎంకే రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో తమిళేతరులు తమ మాతృభాషల్లో చదువుకోవాలనే కనీస కోర్కెను కూడా ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. గత ఎన్నికల్లో తమిళేతర ప్రజలు అన్నాడీఎంకే పార్టీకి బాహాటంగా మద్దతు ప్రకటించినప్పటికీ వివక్ష కొనసాగుతోందన్నారు. చివరకు ఈ విషయాన్ని రాష్ట్రగవర్నర్ డాక్టర్ కె. రోశయ్యదృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఎనిమిది నెలలక్రితమే ఈ సమస్యపై దృష్టిపెట్టాలని గవర్నర్ ముఖ్యమంత్రికి సూచించినా ఫలితం లేదన్నారు. తద్వారా రాష్ట్రంలోని తమిళేతరప్రజలు తమ రాజ్యాంగ హక్కుని కోల్పోతున్నారని సీఎంకే రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Us presidential award for three indian american scientists
Pranab mukherjee takes oath as 13 president  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles