Maddala rajesh kumar mla comment

maddala rajesh kumar mla comment

maddala rajesh kumar mla comment

rajesh00.gif

Posted: 08/01/2012 11:40 AM IST
Maddala rajesh kumar mla comment

maddala rajesh kumar mla comment

 ఎవరైనా అధికారులు పనిచేయకపోతే సైకోసాంబయ్యలా మారి బ్లేడుతో కోస్తేనే పనులవుతాయన్న అభిప్రాయానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ అధికారుల నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే రాజేష్ విరుచుకుపడ్డారు.తాగునీటి సమస్యకు సంబంధించి ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం మీడియాకు తాను చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజేష్ వివరణ ఇస్తూ తాను ఎవరిని సైకోలా మారమని చెప్పడంలేదని, అధికార పార్టీఎమ్మెల్యే అయిన తాను చెప్పినా అధికారులు పనిచేయడం లేదని వాపోయారు. తాము కూడా పోరాటాలు చేస్తే తప్ప అధికారులు పనిచేసే పరిస్థితిలో లేరన్నారు.ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఏలూరు ఎంపీ కావూరు సాంబశివరావు, మంత్రి పితాని సత్యనారాయణలు కూడా సమావేశంలో అధికారులపై విరుచుకుపడ్డారు.

బాధ్యతారహితంగా కొన్ని శాఖల అధికారులు వ్యవహరించడం పట్ల నిర్దేశిత లక్ష్యాలకు భంగం వాటిల్లుతున్నదని ఎంపీ కావూరు పేర్కొన్నారు. అభివృద్ధికి నిధులు తీసుకురావడం కష్టమని, అయినా జిల్లాకు కోట్లాది రూపాయలు నిధులు వస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోకపోవడం బాధాకరమని మంత్రి పితాని పేర్కొన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vengeful bull gored man to deathfollowed the man to hospital and crematorium during his funeral
Sunny leone demands medical tests of randeep hooda and arunoday singh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles