పెద్ద పేగుకు కేన్సర్ సోకితే మందు లేదు. మరణమొక్కటే శరణ్యం. అతి వేగంగా విస్తరించే ఈ కేన్సర్‌ను అడ్డుకోవడం ఏ దశలోనూ సాధ్యం కాదు. కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ వంటి చికిత్స పద్ధతులు పూర్తి ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి. దీంతో మృత్యుముఖంలోకి వెళ్లిపోతున్న రోగిని అచేతనంగా చూస్తూ ఉండటం తప్ప వైద్య శాస్త్రంలో ఎలాంటి 'సంజీవిని' కూడా అందుబాటులో లేదు.ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు ఐదు లక్షల మంది పెద్దపేగు కేన్సర్‌కు గురవుతుండగా అందులో అమెరికాలోనే 1,50,000 కేసులు నమోదవుతూ 50 వేల మంది మృత్యువాత పడుతున్నారు. ఎంతకీ కొరకరాని కొయ్యగా ఉన్న ఈ కేన్సర్‌కు మన తెలుగువాడు అద్భుతమైన చికిత్స పద్ధతిని కనుగొన్నారు. జన్యుపరమైన లోపాల అధ్యయనం ద్వారా పెద్ద పేగు కేన్సర్‌కు శక్తిమంతమైన చికిత్స పద్ధతిని కనుగొనవచ్చునని తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఎన్ఆర్ఐ ప్రొఫెసర్ రాజు కుచ్చర్లపాటి గుర్తించారు.
సదరు జన్యువుల్లోని బలహీనమైన భాగాలను గుర్తించి సత్వరం చికిత్స చేయడం ద్వారా రోగగ్రస్థ కేన్సర్ కణం ఉత్పరివర్తనాన్ని అడ్డుకోవచ్చునని తన అధ్యయనంలో రాజు కనుగొన్నారు. మెదడు, కాలేయం, రొమ్ము తదితర భాగాల్లో ఏర్పడే కేన్సర్‌నూ ఇదే పద్ధతిలో నిరోధించవచ్చునని ఆయన ప్రతిపాదిస్తున్నారు. నిజానికి, జన్యుపరమైన రుగ్మతగా కేన్సర్‌ను వైద్య నిపుణులు చూస్తున్నారు. అయితే, జన్యువులో ఎక్కడ ఈ రుగ్మత మొదలవుతుంది? ఎలాంటి జన్యుమార్పుల వల్ల వ్యాధి తలెత్తుతుందనేది మాత్రం ఇప్పటిదాకా గుర్తించలేకపోయారు.ఈ కేన్సర్ ఉత్పరివర్తనాన్ని అడ్డుకోగల శక్తి ఇప్పుడున్న ఔషధాలకు లేదని తేల్చేశారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఉన్న రాజు..20 ఏళ్లుగా ఇదే అంశంపై పరిశోధన చేస్తున్నారు. ప్రస్తుతం కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ వంటి పద్ధతులు అందుబాటులో ఉన్నా పెద్ద ఫలితం కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కేన్సర్ జెనోమ్ అట్లాస్ ప్రాజెక్టు కింద పెద్దపేగు కేన్సర్‌పై విస్తృతస్థాయిలో పరిశోధనలు జరుపుతున్నట్టు వెల్లడించారు.
ప్రాజెక్టులో భాగంగా గతంలోనూ అనేక అధ్యయనాలు జరిపినప్పటికీ తాజా అధ్యయనం అనేక విధాల ముఖ్యమైనదని రాజు చెప్పారు. " మేము చేపట్టిన ప్రాజెక్టు విలువ కొన్ని వేల కోట్ల డాలర్లు. తాజా అధ్యయనంలో భాగంగా 250 దాకా రోగగ్రస్థ కణితి నమూనాలను పరీక్షించాం. ఈ క్రమంలో భిన్నమైన జన్యుమార్పులను కనుగొన్నాం. జన్యువులోని బలహీన భాగాల్లోనే కేన్సర్ తలెత్తుతుందని అంతిమంగా నిర్ధారణకు వచ్చాం'' అని వివరించారు.కేన్సర్‌పై సమరమే జీవితంగా.. కేన్సర్ వైద్యపరిశోధనలకు జీవితం అంకితం చేసిన రాజు కుచ్చర్లపాటి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. ఆంధ్రా వర్సిటీలో ఎమ్ఎస్ పూర్తిచేశారు. ఉన్నత చదువుల కోసం 1967లో ఆయన అమెరికా వెళ్లారు. ఇలినాయ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. అనంతరం ఇలినాయ్ యూనివర్సిటీ అనుబంధ మెడికల్ కాలేజీ జెనెటిక్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.ఈ క్రమంలో 1989లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెడికల్ కాలేజీ మాలిక్యులర్ జెనెటిక్స్ విభాగం చైర్మన్‌గా ఎంపికై.. 11 ఏళ్లు ఆ బాధ్యతలు నిర్వహించారు. 2001లో హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ మెడికల్ స్కూలు ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. ఈ స్కూలుకు అనుబంధంగా ఏర్పాటుచేసిన జెనెటిక్స్ అండ్ జెనోమిక్స్ హెల్త్ కేర్ సెంటర్ (హెచ్పీసీజీజీ) తొలి డైరెక్టర్‌గా రాజు ప్రస్తుతం పనిచేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more