Belgian cyclist kicked out of olympics after drunken night

Belgian cyclist kicked out of Olympics after drunken night,Belgian cyclist Gijs van Hoecke ,

Belgian cyclist kicked out of Olympics after drunken night

Belgian.gif

Posted: 08/10/2012 06:49 PM IST
Belgian cyclist kicked out of olympics after drunken night

Belgian cyclist kicked out of Olympics after drunken night

ఒలింపిక్స్‌లో తాగుడు పోటీలు కూడా పెట్టారా అని ఆశ్చర్యపోకండి. అలాంటిదేమీ లేదు. కాకపోతే కొందరు క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నామన్న అత్యుత్సాహంతో కట్టు తప్పుతున్నారు. లండన్‌లో తప్పతాగి పడిపోతున్నారు. అందులో బెల్జియంకు చెందిన ట్రాక్ సైక్లిస్ట్ వాన్ హొయెక్ ఒకడు. ఈ 20 ఏళ్ల యువ ఆటగాడు ఫూటుగా మందు కొట్టి... నిలబడలేని స్థితిలో ఉండగా అతడి స్నేహితులు ట్యాక్సీ ఎక్కించి పంపించారు. ఈ దృశ్యాలన్నీ పత్రికల్లో వచ్చాయి. దీంతో అవాక్కవడం బెల్జియం ఒలింపిక్ కమిటీ వంతయింది  ఫొటోల్లో హోయెక్ దాదాపు కళ్లు మూసుకుపోయిన స్థితిలో జట్టు సభ్యుడు జోనాథన్ డఫ్రాస్నెతో పాటు మరో వ్యక్తి సాయంతో టాక్సీలోకి ఎక్కుతున్నట్లు కనిపిస్తోంది. అతని షర్ట్, ప్యాంట్ల మీద కూడా మద్యం బాగా ఒలికిపోయిన గుర్తులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటిష్ టాబ్లాయిడ్ ‘ద మిర్రర్’ ఈ కథనానికి హాస్యాన్ని జోడించి వాన్ హొయెక్‌కు మందు కొట్టడంలో గోల్డ్‌మెడల్ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అవమానానికి గురైన బెల్జియం అధికారులు తక్షణమే హొయెక్‌ను ఒలింపిక్స్ నుంచి తొలగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pattabhirama rao seeks special prisoner status
Section of chinas great wall collapses in heavy rains  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles