ఇప్పుడు అబ్బాయిలు ట్రెండ్ మారింది. పెళ్లి చేసుకోనే అబ్బాయిలు తనకు ఎలాంటి వధువు కావాలో బహిరంగంగానే చెబుతున్నారు. తనకు కాబోయే భార్య .. ఉద్యోగం చేయని అమ్మాయి మాత్రమే కావాలని అబ్బాయిలు కోరుకుంటున్నారట. వేణ్నీళ్లకు చణ్నీళ్లలా.. ఏదో ఒక ఉద్యోగం చేసే భార్య దొరికితే బాగుండు అని ఆశించే వారు ఇంకొందరు . ఈ సంగతులు పక్కన పెడితే.. ఉద్యోగం చేయని వధువు కోసం ఇటీవల బాగా డిమాండ్ పెరిగినట్లు ఓ సర్వేల్లో తేలింది. ‘‘ నన్ను, పుట్టబోయే పిల్లలను , ఇంటిని చక్కగా చూసుకుంటే చాలు’’. ఉద్యోగం చేయనక్కర్లేదు. అని నవతరం యువకులు కోరుకుంటున్నట్లు తెలిసింది.
జీవన్ సాధి.కామ్ అనే పెళ్లి సంబందాల వెబ్ సైట్ జరిపిన సర్వేలో దీంతో పాటు మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఉద్యోగం చేయకుండా ఇంటి పనులు చూసుకునే యవతులకు గత ఏడాదిలోనే 15 శాతం డిమాండ్ పెరిగినట్లు జీవన్ సాథి. కామ్ బిజినెస్ హెడ్ రోహీత్ తెలిపారు. నేటి యువకులు ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని ఎంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఉద్యోగం చెయని వధువులను ఆశిస్తున్నారు అని వివరించారు. ఒక వేళ భార్య కూడా ఉద్యోగం చెయాలని అనుకుంటే .. టీచర్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. తక్కువ పని వేళలు, ఎక్కువ సెలవులు వ్యక్తిగత జీవితానికి ఉద్యోగ జీవితానికి మధ్య సమతౌల్యం ఉండే ఉద్యోగం ఇది. అందుకే టీచర్ వధువులకూ డిమాండ్ పెరుగుతోంది. అని రోహిత్ వివరించారు. వధువు కోసం కిందా మీదా పడుతూ. పెద్ద సంఖ్యలో ప్రయత్నాలు చేసే వారిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులే ముందంజలో ఉన్నారట.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more