Teacher fakes his abduction murder to teach wife a lesson

Teacher fakes his abduction, murder to teach wife a lesson,Delhi, coaching centre, ashikumar petar, asih kumar petar relation student, asis own plan, asis escaped, asis wife compliant police, police investigation students, delhi police arrest

Teacher fakes his abduction, murder to teach wife a lesson

Teacher.gif

Posted: 09/10/2012 03:55 PM IST
Teacher fakes his abduction murder to teach wife a lesson

Teacher fakes his abduction, murder to teach wife a lesson

 ఓ ఇంగ్లీష్ టీచర్ తన శిష్యురాలితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అతని భార్య దీనిని గుర్తించి నిలదీసింది. దీంతో అతడు తనను నిలదీసిన భార్యకు గుణపాఠం చెప్పాలని తనను తానే కిడ్నాప్ చేసుకొని... ఎవరో తనను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లుగా నాటకమాడాడు. అయితే పోలీసులు అతని నాటకాన్ని కనిపెట్టి, జైలులో పెట్టారు. న్యూఢిల్లీకి చెందిన ఆశిష్ కుమార్ అనే 37 ఏళ్ల వ్యక్తి స్థానికంగా కోచింగ్ సెంటర్ నడుపుతున్నాడు. అతను ఇంగ్లీష్ బోధిస్తుంటాడు. తన వద్దకు ట్యూషన్ కోసం వచ్చిన ఓ విద్యార్థినితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ విద్యార్థిని ఇతని కంటే పదేళ్లు చిన్నది. అక్రమ సంబంధాన్ని గుర్తించిన ఆశిష్ భార్య తరుచూ అతనితో గొడవపడేది. దీంతో ఓ రోజు ఉదయం కోచింగ్ సెంటర్‌కు వెళ్లి అటు నుంచి మాయమయ్యాడు. ఆశిష్ అదృశ్యమయ్యాడని అతని భార్య నరేలా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు కిడ్నాప్ తీగ అంతా లాగారు. దీంతో డొంక అంతా కదిలింది. ఆశిష్ తనకు తానుగానే కిడ్నాప్ చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. అంతేకాదు తనను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా భావించేలా ఆశిష్ తన చేయి కోసుకొని తన కోచింగ్ సెంటర్‌లో రక్తం మరకలు చిందేలా చేశాడు. అక్కడి నుండి పరారై డెహ్రాడూన్‌లో ఉంటున్న ఓ స్నేహితుడు ఇంట్లో మకాం వేశాడు. గుండు గీయించుకొని వేషం మార్చాడు. సిమ్ మార్చుకున్నాడు. ఇంతా చేసి తన శిష్యులతో మాత్రం అనుబంధాన్ని కొనసాగించాడు. అదృశ్యమైన అశిష్ సెప్టెంబర్ 3న కొత్త సిమ్ కార్డు తీసుకొని ఉపయోగించాడని, దానిని ట్రేస్ చేశామని పోలీసులు తెలిపారు. కోచింగ్ సెంటర్ వద్ద ఉన్న రక్తం చూసిన ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు ఆ రక్తం కిడ్నాప్‌కు గురైన వ్యక్తిది కాదని చెప్పారని పోలీసుల చెప్పారు. ఫోన్ ట్రేస్ చేసిన తాము అశిష్ డెహ్రాడూన్‌లో ఉన్నాడని గుర్తించామని, వెంటనే అక్కడకు బృందాన్ని పంపడంతో అతను తన స్నేహితుడి ఇంట్లోనే ఉన్నారని చెప్పారు. విచారిస్తే అతనే ఈ నాటకమంతా ఆడినట్లు తెలిసిందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Boat capsizes in bihar
Lagadapati rajagopal vs mp vivek  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles