Jagan mohan reddy to be in jail till september 28

Jagan Mohan Reddy to be in jail till September 28, Jagan Mohan Reddy, YSR Congress

Jagan Mohan Reddy to be in jail till September 28

Jagan.gif

Posted: 09/14/2012 03:44 PM IST
Jagan mohan reddy to be in jail till september 28

Jagan Mohan Reddy to be in jail till September 28

బెయిల్ కోసం రెండు సార్లు అవమానం చెందిన జగన్ .మూడోసారి కూడా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 28కి వాయిదా పడింది. జగన్  బెయిల్ ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. సీబీఐ సమర్పించిన అఫిడవిట్ పరిశీలించాక వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. జగన్ విచారణకు సహకరిస్తున్నా ఎందుకు అరెస్ట్ చేశారని న్యాయస్థానం ప్రశ్నించింది. గతంలో రెండుసార్లు హైకోర్టులో బెయిల్ పిటిషన్లు వేసినా కోర్టు కొట్టివేసింది. దీంతో తనకు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జగన్ పిటిషన్  సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. గతంలో జగన్ రెండుసార్లు బెయిల్ కోసం పిటిషన్ వేసినా హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఇక జగన్ కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని, సాక్ష్యులను బెదిరిస్తారని సీబీఐ వాదిస్తోంది. జగన్ అక్రమాలు అన్నీఇన్నీ కావంటూ ఈ దశలో బెయిల్ ఇచ్చినట్టయితే సాక్షులను బెదిరించే ప్రమాదం ఉందని సీబీఐ వాదిస్తూ వస్తోంది. విదేశాలనుంచి హవాలా మార్గంలో డబ్బు దేశంలోకి ప్రవాహంలా పారిందని దీనికి సంబంధించిన అన్ని ఆధారాలనూ సేకరిస్తున్నామని చెప్తోంది. అయితే తొమ్మిది నెలల దర్యాప్తు సమయంలో బయటే ఉన్నప్పుడు మార్చని సాక్ష్యాలను ఇప్పుడెలా మారుస్తారని జగన్ తరపు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా జగన్ కు బెయిల్ వస్తుందా..? లేదా..? అనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi court issues summons to dharmana in vanpic case
Mans penis cut in lover  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles