Cameramen gangatoramabu bandaru dattatreya bjp

cameramen gangatoramabu bandaru dattatreya bjp critisise sensor board members

cameramen gangatoramabu bandaru dattatreya bjp

5.png

Posted: 10/21/2012 02:05 PM IST
Cameramen gangatoramabu bandaru dattatreya bjp

datt

      కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా మీద కామెంట్ల పరంపర కొనసాగుతుంది. తెలంగాణ ఉద్యమాలను కించపరిచే సినిమాలను నియంత్రించటంలో సెన్సార్ బోర్డు విఫలమైందని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. సెన్సార్ బోర్డును తక్షణమే రద్దు చేయాలని ఆయన ఆదివారమిక్కడ డిమాండ్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాకే తెలంగాణలో పాదయాత్ర చేయాలన్నారు. తెలంగాణపై కేంద్రం నాన్చుడి ధోరణిని అవలంభిస్తోందని దత్తాత్రేయ ధ్వజమెత్తారు.
     మరోవైపు.. ఏ ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం చిత్రంపై నిరసనల వెల్లువ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ చిత్రాన్ని నిరసిస్తూ ఆదివారం బ్రాహ్మణులు భద్రాచలంలో గోదావరి ఒడ్డును చిత్ర యూనిట్ కు పిండ ప్రదానం చేశారు. చలం పేరు అడ్డుపెట్టుకుని అటువంటి చిత్రాలు తీసి బ్రాహ్మణులను కించపరుస్తారా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vemulavada raja rajeswara swami temple panic
Miryalaguda harika suiside  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles