అధికార కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్సీ టిక్కెక్కట్లను తన వారికి ఇప్పించడం కోసం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి , ఉపముఖ్యమంత్రి, పీసీసీ బొత్స ఢిల్లీ వెళ్లి అక్కడ మకాం వేసి కాంగ్రెస్ పెద్దలను కలిసి లాబీయింగ్ లు జరిపిన విషయం తెలిసిందే. వివిధ ముఖ్యనేతలతో సమావేశం అయిన వీరు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ ఎంపికలో కాంగ్రెస్ అధినేత్రి ముద్ర కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ గులాంనబీ అజాద్ ఈరోజు ఉదయం సమావేశమై అభ్యరులను ఖరారు చేసినట్లు సమాచారం. ఇక బొత్స ఎమ్మెల్సీ అభ్యర్థులకు బి ఫారాలు రేపు ఇస్తామని చెప్పడం చూస్తుంటే దాదాపు తుది జాబితా తయారైనట్లే కనిపిస్తుంది. ఇప్పటి వరకు సస్పెన్స్ లో ఉన్న ఈ జాబితాలోని పేర్లను ఏ క్షణంలోనైనా ప్రకటన చేసే అవకాశం ఉంది. ముందు అనుకున్నవారు కాకుండా కొత్త వారు పేర్లు ఇందులో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్ధులలో ముఖ్యంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి, ధీరావత్ భారతి, వాణి, రఘురామిరెడ్డి, కంతేటి సత్యనారాయణ రాజు, దయాసాగర్, షబ్బీర్ అలీ పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more