Leaders paid respects to ambedkar on his birth day

baba saheb ambedkar, chiranjeevi, damodara raja narsimha, kondru murali, bhatti vikramarka, cpm raghavulu

leaders paid respects to ambedkar on his birth day

అంబేద్కర్ కి ఘన నివాళి

Posted: 04/14/2013 11:13 AM IST
Leaders paid respects to ambedkar on his birth day

ఈ రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నాయకులు దళిత వర్గాలు ఆయనను గుర్తు చేసుకుని నివాళులర్పించారు. 

హైద్రాబాద్ ట్యాంక్ బండ్ మీదున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ, మంత్రి కొండ్రు మురళి, ఉప సభాపతి భట్టి విక్రమార్క, సిపిఎం కార్యదర్శి రాఘవులు తదితర నాయకులు ఘన నివాళులర్పించారు. 

అదే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేంద్ర పర్యాటక శాఖా మంత్రి చిరంజీవి మాట్లాడుతూ, దళితులు అబివృద్ధికోసం అమలు పరుస్తున్న ఎస్ సి ఎస్ టి ఉప ప్రణాళిక చాలా ఉపయోగకరమని అన్నారు.  కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను అమలుపరిస్తే దళితులకు సంపూర్ణంగా న్యాయం చేకూరుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు.  ఆ తర్వాత, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయసాధనకోసం ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేస్తేనే అది నెరవేరుతుందని చిరంజీవి అన్నారు.

లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ, కులవివక్షను రూపు మాపటమే లక్ష్యంగా అంబేద్కర్ పనిచేసారని, ఆయన ఆశయ సిద్ధికోసం అదే దారిలో పోవలసిన అవసరం అందరికీ ఉందని చెప్తూ, అవినీతిని రాజకీయలలోంచి బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నంలో అందరూ కృషి చెయ్యాలని కూడా ఆయన అన్నారు.

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles