Maoists dead bodies sent to their villages

maoists dead bodies, chattesgarh, andhra border, maoists encounter, maoists bodies sent to villages, mla sitakka

maoists dead bodies sent to their villages

మావోయిస్ట్ ల మృతదేహాలను వాళ్ళవాళ్ళకు

Posted: 04/18/2013 09:35 AM IST
Maoists dead bodies sent to their villages

మంగళావారం ఛత్తీస్ గఢ్- ఆంధ్రప్రదేశ్ లోని ఖమ్మంజిల్లా సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్ట్ లను వారి వారి బంధువులకు పంపించారు. 

నిన్న మృత దేహాలను ఇవ్వరన్న అభిప్రాయంతో మావోయిస్ట్ ల సమీప బంధువులు మృతదేహాలనుంచిన భద్రాచలం ప్రభుత్వాసుపత్రి దగ్గర ఆందోళనకు దిగారు.  వారికి మద్దతుగా శాసనసభ్యురాలు సీతక్క కూడా ఆందోళన చేపట్టారు.  బంధువులకు చూపించమని ఇచ్చిన కోర్టు ఆదేశాలను కూడా లెక్క చెయ్యరా అంటూ అధికారులను నిలదీసారు.  ఇవేమీ పట్టించుకోకుండా 10 మంది మావోయిస్ట్ ల మృతదేహాలను రాయచూర్ పంపించటానికి సిద్ధమవుతున్న అధికారుల మీద ఆందోళన ఉధృతం చేసారు. 

అయితే ఈరోజు అధికారులు 8మంది మృతదేహాలను గణపురం, తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట మండలాలలోని వారి వారి స్వగ్రామాలకు తరలించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles