Digvijay singh comment on telangana issue

digvijay singh comment on telangana issue, digvijay singh, telaangana issue, telangana state, congress party, digvijay singh, 2014 eleciton,

digvijay singh comment on telangana issue

తెలంగాణకు గడువు లేదు: దిగ్విజయ్

Posted: 07/01/2013 08:40 PM IST
Digvijay singh comment on telangana issue

తెలంగాణ అంశం తుది దశకు చేరుకుందని, అయితే దానికి తుది గడువు ఏదీలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. గాంధీభవన్ ఆయన పిసిసి సమన్వయ సంఘంతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ అంశంపై రాజకీయ పక్షాలు, ప్రజాప్రతినిధుల స్థాయిలో చర్చలు జరిగాయి. తుదినిర్ణయం కోసం కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు. ఎవరికి వారు వేర్వేరు నివేదికలు సమర్పిచాల్సిందిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడిని కోరినట్లు తెలిపారు. అంతిమ నిర్ణయం తీసుకున్నతరువాత ఏం చేయాలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు చర్చిస్తారని చెప్పారు. తెలంగాణకు సంబంధించి రెండు ఆప్షన్లు పరిశీలిస్తున్నాం. ఒకటి సమైక్యాంధ్ర, రెండోది తెలంగాణ - ఈ రెండు ఆప్షన్లతో రోడ్ మ్యాప్ తయారుచేయమని చెప్పినట్లు తెలిపారు. రాజకీయ, పరిపాలనా కోణంలో రోడ్ మ్యాప్ ఉంటుందన్నారు. కేంద్ర నిర్ణయానికి రాష్ట్ర కాంగ్రెస్ కట్టుబడిఉంటుందని చెప్పారు. రెండో ఎస్ ఆర్ సి అనేది 2004 ఎన్నికల హామీ అని, దురదృష్టవశాత్తూ దాన్ని అమలు చేయలేకపోయామన్నారు. అన్ని అంశాలనూ సమగ్రంగా పరిశీలించిన తరువాతే కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. దేశ ప్రయోజనాల దృష్ట్యానే రాష్ట్ర విభజన ఉంటుందన్నారుకాంగ్రెస్ పార్టీ ముందు 2014 అనే రాజకీయ సవాల్ ఉందని చెప్పారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles