Rath yatra of lord jagannath celebrated in puri

ratha yatra of lord jagannath, rath yatra 2013 live, puri live rath yatra 2013 live, rath yatra of lord jagannath celebrated in puri, world famous rath yatra of lord jagannath celebrated in puri, tight security, ratha jatra puri 2013, jagnnath temple puri, jagannath rath yatra 2013, car festival 2013, lord jagannath

Rath Yatra of Lord Jagannath celebrated in Puri, World famous Rath Yatra of Lord Jagannath celebrated in Puri,

పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభం? వలయంలో పోలీసులు

Posted: 07/10/2013 05:35 PM IST
Rath yatra of lord jagannath celebrated in puri

వైశాఖ మాసం శుక్ల పక్షంలో అక్షయ తృతీయ తిథి రోజున ఈ ఉత్సవ కార్యక్రమాలకు అంకురార్పణ జరుగుతుంది. 12 శతాబ్దంలో నిర్మితమైన జగన్నాథుని ఆలయంనుంచి ప్రతి ఏడాది మాదిరిగానే ప్రత్యేకంగా తయారుచేసిన మూడు రథాలపై జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల విగ్రహాలను ఊరేగిస్తున్నారు. ఈనెల 29న బహుదా జాతర నిర్వహించిన అనంతరం మూడు రథాలలో దేవేరులు తమ నివాసమైన ఆలయానికి చేరుకోవడంతో రథయాత్ర పరిసమాప్తమవుతుంది. ప్రఖ్యాత పూరి జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దేవతలకు, మానవులకు మధ్య సారూప్యతలను సూచిస్తూనే.. లౌకికవాదానికి, సామరస్యానికి ప్రతీకగా చెప్పుకునే ఈ రథయాత్రకు దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.

శ్రీ జగన్నాథ ఆలయ వార్షిక వేడుకల్లో అత్యంత ముఖ్యమైన ఉత్సవ ఘట్టం ఈ రథయాత్ర. ఇందులో భాగంగా స్నాన ఉత్సవం, నవ యౌవన దర్శన్‌, రథోత్సవం, హేరా పంచమి, సంధ్యా దర్శన్‌, బాహుదా యాత్ర, సునా బేస, నీలాద్రి బిజె కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తారు. జగన్నాథుడు, ఆయన అన్నగారు బలభద్రుడు, సోదరి సుభద్ర కోసం మూడు భారీ రథాల నిర్మాణం మొదలవుతుంది. పారంపర్యంగా వచ్చే పూజారీతుల కనుగుణంగా దేవతామూర్తులను లయబద్ధంగా నామస్మరణ, సంకీర్తనలు, భజనల నడుమ రథాలలో ఎక్కించే ప్రక్రియను ‘పహుండి’ అని పిలుస్తారు. ముందుగా సుదర్శనుని, తర్వాత బలభద్రుని, పిదప సుభద్రాదేవిని, చివరకు జగన్నాథస్వామి వార్ల మూర్తులను ఒక్కొక్కటిగా ఆయా రథాలలోకి ఎక్కిస్తారు. ఈ వేడుకలు మూడు వారాల పాటు సాగుతాయి. జగన్నాథ రథయాత్ర వేడుకలను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి తరలి వచ్చారు. అయితే ఈ సారి జగన్నాథ రథయాత్రపై పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles