Cwc meeting tension among ap leaders

CWC Meeting Tension among AP Leaders, TRS president, Chandrasekhar Rao, KCR, TRS leader KCR, Telangana issue, CWC meeting, Congress core group, Venugopalachary join in TRS, Telangana

CWC Meeting Tension among AP Leaders

అమ్మ టీ ఇస్తుందా?

Posted: 07/30/2013 07:33 AM IST
Cwc meeting tension among ap leaders

ఈ రోజు అమ్మ టీ ఇస్తుందా? లేదా అనే అనుమానం మన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పరిణామాలను గమనిస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చేట్లే కనిపిస్తోంది. అయినా ఆ పార్టీని చివరిదాకా నమ్మలేం' అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఆ పార్టీ సెక్రెటరి జనరల్‌ కె.కేశవరావు నివాసంలో కేసీఆర్‌తో పాటు తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్‌ కోదండరాం, జెఎసి నాయకులు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంలో కేసీఆర్‌ మాట్లాడుతూ, యుపిఎ సమన్వయ కమిటీ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నందున ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణకు అనుకూలంగానే ఉన్నాయని, అయితే చివరకు మెలికపెట్టే అవకాశాలు కూడా ఉంటాయని ఆయన అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాయల తెలంగాణ విషయంలో రాయలసీమ ప్రజలనుండి కూడా వస్తున్న వ్యతిరేకతను కూడా గమనించి ఆ ప్రతిపాదన పట్ల కాంగ్రెస్‌ వెనుకడుగు వేసినట్లుగానే కనిపిస్తోందని కూడా కేసీఆర్‌ చెప్పినట్లు తెలుస్తోంది. రాయల తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తేలేదని వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అనుకూల నిర్ణయం తీసుకున్నా అందుకు అనుగుణంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని కేసీఆర్‌ కోదండరాంకు సూచించినట్లు తెలిసింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles