Rajiv gandhi birth annivarsary celebrated

Rajiv Gandhi 69th birth annivarsary, Former Prime Minister Rajiv Gandhi, Sonia Gandhi, Manmohan Singh, Priyanka Gandhi, Rahul Gandhi

Rajiv Gandhi birth annivarsary celebrated

రాజీవ్ గాంధీ జయంతి

Posted: 08/20/2013 02:42 PM IST
Rajiv gandhi birth annivarsary celebrated

ఆగస్ట్ 20 1944లో ముంబైలో జన్మించిన రాజీవ్ గాంధీ పూర్తి పేరు రాజీవ్ రత్న గాంధీ.  దివంగత నేతకు ఈరోజు 69 వ జయంతిని పురస్కరించుకుని ఆయన భార్య సోనియా గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ఇతర కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో ఆయన సమాధి వీర్ భూమి వద్ద నివాళులర్పించారు. 

అక్టోబర్ 31 1984లో ఆయన తల్లి ఇందిరా గాంధీ హత్య జరినప్పుడు దేశ ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన రాజీవ్ గాంధీ 1991 లో శ్రీపేరుంబూదూరులో మే 21న ఆయన కూడా హత్య గావించబడ్డారు.  ప్రధానమంత్రులలో అతి చిన్న వయసు నాయకుడిగా ఆయన పేరుగాంచారు.  ఆయన హయాంలో 1984 ఎన్నికలలో 542 సీట్లకు 411 సీట్లు సాధించి కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని చవిచూసింది. 

శ్రీలంకలో శాంతి స్థాపనకోసం చేసిన ప్రయత్నాల వలన శ్రీలంకలోని లిబరేషన్ ఆఫ్ తమిళ ఏలమ్ ఆయనను శత్రువుగా చూసి, ఆయన దక్షిణ భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడు శ్రీపేరుంబూదుర్ ఆత్మాహుతి దాడి ద్వారా హత్య చేసారు. 

ఈ రోజు హైద్రాబాద్ గాంధీ భవన్ లో రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.  పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్, ఇంకా ఇతర కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీకి నివాలులర్పించి, ఆయన సేవలను కొనియాడారు.  దేశ సర్వోతోముఖాభివృద్ధికి రాజీవ్ గాంధీ ఎనలేని సేవలు చేసారని, దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడటానికి ఎంతో కృషిచేసారని అన్నారు. 

రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీల పెద్ద కుమారుడు.  ఆయన భార్య సోనియా గాంధీ ఆయన తర్వాత కాంగ్రెస్ అధిష్టానాన్ని అలంకరించారు.  ఆయన కూతురు ప్రియాంకా గాంధీ, కుమారుడు రాహుల్ గాంధీ.  రాహుల్ గాంధీ ప్రస్తుతం అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles