రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజీనామా చేసి , సమైక్యాంద్రకు మద్దతు తెలిపిన మాజీ రాజ్యసభ నందమూరి హరిక్రిష్ణ పై తెలంగాణా రాష్ట్ర సమితి అద్యక్షడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయుడు కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. హరిక్రిష్ణ తన తండ్రి ఆశయల కోసమే రాజీనామా చేసినట్లుగా చాలా విడ్డురంగా ఉందని కేటిఆర్ అన్నారు. ఎన్టీఆర్ ఎప్పుడు తెలుగు జాతి కలిసి ఉండాలని చెప్పలేదని, హరిక్రిష్ణ కు చరిత్ర తెలియకుండా మట్లాడుతున్నాడని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అవకాశవాదానికి, అనైతిక రాజకీయాలకు కేంద్రంగా మారిందని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించార. తెలుగు జాతి కలిసి ఉండాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నారన్నా హరికృష్ణ వాదనకు అర్థం లేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో రాష్ట్రాన్ని విభజించాలని ఎన్టీఆర్ స్వయంగా కోరారని కేసిఆర్ కొడుకు కేటీఆర్ గుర్తు చేశారు. హరికృష్ణ చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబును తెలుగుదేశం పార్టీలోకి చేరుకోవద్దని ఎన్టీఆర్ కు అనేక మంది రాజకీయ నాయకులు చెప్పటం జరిగింది. కానీ ఎన్టీఆర్ చంద్రబాబును చేర్చుకోవటంతో ఏం జరిగిందో.. అందరికి తెలుసునని కేటిఆర్ అన్నారు. ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు చరిత్ర గురించి తెలుసుకోవాలని కేటిఆర్ ఉచిత సలహా ఇవ్వటం జరిగింది. కేటిఆర్ వ్యాఖ్యలకు టిడిపి నాయకులు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more