Hyderabad to be union territory

Sushilkumar Shinde, Telangana, Telangana issue, separate statehood, united Andhra Pradesh state, M.M. Pallam Raju, Chiranjeevi, Prime Minister Manmohan Singh, Congress Working Committee

Hyderabad to be Union Territory

యూటీ కోసం నాయకులు కసరత్తు

Posted: 09/04/2013 12:33 PM IST
Hyderabad to be union territory

విభజన ప్రక్రియలో భాగంగా హైదరాబాదుని కేంద్ర పాలిత ప్రాంతం(యూనియన్‌ టెర్రిటరీ-యూటీ)గా మార్చే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందా? రెండు రోజులుగా ఢిల్లీ రాజకీయ లాబీల్లో ఇది జోరుగా వినిపిస్తోంది. ఆంటోనీ కమిటీ సీమాంధ్రుల ఆత్మఘోష వింటున్నదని ఒకవంక చెబుతుండగానే.. హైదరాబాదుని యూటీగా చేయడానికి విస్తృత ప్రాతిపదికన తెర వెనక కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని సీమాంధ్ర నేతలు నర్మగర్భంగా చెబుతుండగా.. తెలంగాణా కాంగ్రెస్‌ నేతలు కూడా ఆ ప్రతిపాదన ఊపందుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. చండీగఢ్‌ తరహాలో హైదరాబాదుకి స్వతంత్ర హోదా కల్పించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు పీటీఐ వార్తాసంస్ధ ఇచ్చిన కథనం రాజకీయ వర్గాల్లో సంచలనమే సృష్టించింది. యూటీ హోదా కల్పించి, ఉభయ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని హోం మంత్రిత్వ శాఖలో నోట్‌ సిద్ధం అవుతున్నదన్న పుకార్లు బాగా వ్యాపించాయి. సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలు, సీమాంధ్ర తెలుగుదేశం ఎంపీల నుంచి గత నెల రోజులుగా వస్తున్న తీవ్ర నిరసనకు కేంద్రం పునరాలోచనలో పడ్డదని, దాని ఫలితమే ఈ తాజా ఆలోచన అని వర్గాల కథనం. సీమాంధ్ర ప్రజలు హైదరాబాదుని యూటీ చేసి, ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తే తమ ప్రయోజనాలు నెరవేరతాయని అభిప్రాయపడుతున్నందున, దాన్ని కొట్టివేయలేమని అధికారలాబీల్లోని వర్గాలు వ్యాఖ్యానించాయి..

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles