Dont believe any one singh words says ganta

don-t believe any one singh words says ganta, minister Ganta Srinivasa Rao, congress party, digvijay sing, cm kiran kumar reddy,

don-t believe any one singh words says ganta

సింగ్ చెబితే అది జరగదు : మంత్రి గంటా

Posted: 11/08/2013 04:07 PM IST
Dont believe any one singh words says ganta

కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందని చెప్పిన కొన్ని గంటల్లోనే తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రాదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెల్చి చెప్పారు. అయితే దిగ్విజయ్ సింగ్ మాటలపై రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 

దిగ్విజయ్ చెప్పిన అంశాలకు విరుద్ధంగా కాంగ్రెస్ ముందుకు వెళుతుందన్నారు. సీఎంను మార్చి కాంగ్రెస్ మరో తప్పు చేస్తుందని తాను అనుకోవటం లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అసెంబ్లీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రం ఏర్పడలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 

రాష్ట్రపతి రబ్బరు స్టాంప్ లా కాకుండా క్రియాశీలకంగా ఉన్నారని గంటా అన్నారు. విభజన ప్రక్రియను రాష్ట్రపతి అడ్డుకుంటారని భావిస్తున్నామని ఆయన తెలిపారు.

 

దిగ్విజయ్ సింగ్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదని....ఆయన మాటలను ఎవరూ నమ్మరని గంటా అన్నారు. దిగ్విజయ్ ఏది చెబితే ....దానికి వ్యతిరేకంగా జరుగుతుందని ఆయన ఈరోజు వ్యాఖ్యానించారు. అంతకు ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుందని చెప్పారని... అయితే ఇంతవరకూ పర్యటించలేదన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles