Bjp venkaiah naidu fire on congress party

bjp venkaiah naidu fire on congress party,Naidu Fires On Congress Party, Bharatiya Janata Party, congress party, ap bifurcation, telangana issue, cm kiran kumar reddy, narendra modi,

bjp venkaiah naidu fire on congress party, Naidu Fires On Congress Party

మేము స్వరం మార్చలేదు

Posted: 11/09/2013 01:08 PM IST
Bjp venkaiah naidu fire on congress party

తెలంగాణ విషయంలో బీజేపీ స్వరం మార్చలేదని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం మాట్లాడుతూ జీవోఎంకు తెలంగాణపై తమ వైఖరిని స్పష్టంగా చెప్పామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ దుర్మార్గపు నాటకాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. ఢిల్లీ డైరెక్షన్‌లో భాగమే సీఎం సమైక్య నాటకమని విమర్శించారు. కాంగ్రెస్ నాటకాలను బీజేపీ ప్రజల్లోకి తీసుకు వెళుతుందని వెంకయ్య అన్నారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేతల వైఖరి అధిష్టాన నాటకంలో భాగమేనని ఆయన ఆరోపించారు.

 

దేశంలోని సవాళ్లకు కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదని వెంకయ్య అన్నారు. కాంగ్రెస్ ఏ విషయంలోనూ సరైన నిర్ణయం తీసుకోలేకపోయిందన్నారు. తెలంగాణ విషయంలో బీజేపీ సిద్ధాంతం ఎన్నటికి మారదన్నారు. బీజేపీ, నరేంద్ర మోడీని చూస్తే కాంగ్రెస్ కు భయం కలుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో మోడీ నాయకత్వంలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని వెంకయ్య ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడకు వెళ్లినా మోడీ ప్రభంజనం వీస్తుందన్నారు. మావోయిస్టుల సమస్య రాష్ట్ర సమస్య కాదని, దేశ సమస్య అని వెంకయ్య పేర్కొన్నారు.

 

సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని ఆయన వెల్లడించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీని చంపాలని ఇండియన్ ముజాహిద్దీన్ కుట్ర చేస్తోందని, టెర్రరిస్టులకు కొన్ని పార్టీలు సహకరిస్తున్నాయని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles