Ap coast braces for cyclone helen

AP coast braces for cyclone Helen, braces for Cyclone Helen, machilipatnam, cyclonic storm, Helen, braces for super cyclone Helen,

AP coast braces for cyclone Helen

మచిలీపట్నం పై హెలెన్ తుపాన్ దెబ్బ

Posted: 11/22/2013 12:25 PM IST
Ap coast braces for cyclone helen

హెలెన్ తుఫాన్ మచిలీపట్నం తీరంవైపు దూసుకొస్తొంది. ఈ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అయితే అధికారులు అప్రమత్తమై ప్రజలను హెలెన్ తుపాన్ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. సముద్రం అలలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. గాలుల తీవ్రత అంతకంతకూ పెరుగుతుంది. తుపాను సమీపిస్తుండటంతో క్రిష్ణా జిల్లా అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతంలో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తలరిస్తున్నారు.

 

మచిలీపట్నం మండలం పొలాటితిప్ప గ్రామస్థుల్ని పునరావాస కేంద్రానికి తరలించారు. మధ్యాహ్నానికి తుపాను తీరం దాటనుండటంతోభారీ వర్షాలు కురిసే అవకాశంముందని అధికారులు చెబుతున్నారు. తుపాను గండంతో రైతుల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరి కోతలకు సిద్దమై సమయంలో వస్తున్న హెలెన్ తుపానుతో తీవ్ర నష్టం వాటిల్లితుందని రైతులు అవేదన చెందుతున్నారు.తుపాను తీవ్రతపై జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు ఎప్పటిప్పకుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినా ప్రజల్ని రక్షించేందుకు పూర్తిస్థాయిలో సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు.

 

రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావారణ శాఖ అధికారులు చెబుతున్నారు. హెలెన్ తుపాన్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఎప్పటికప్పటికి సముద్రం తీరం వెంబడి అధికారులతో మాట్లాడుతున్నారు. హెలెన్ తుపాన్ గురించి తెలుసుకుంటూ.. అధికారులకు అప్రమత్తం చేస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles