Ex minister jeevan reddy fire on rayala telangana

ex minister jeevan reddy fire on rayala telangana, jeevan reddy slams gom over rayala telangana, jeevan reddy, congress party, rayala telangana

ex minister jeevan reddy fire on rayala telangana, Jeevan Reddy slams GoM over Rayala Telangana

రాయల తెలంగాణ సీమాంధ్ర కుట్రే

Posted: 12/04/2013 10:18 AM IST
Ex minister jeevan reddy fire on rayala telangana

ఇప్పుడు రాష్ట్రంలో రాయల తెలంగాణ వేడితో రగిలిపోతుంది. ఏ రాజకీయ నాయకుడ్ని కదిలించిన, ఏ మీడియాలో చూసిన ఇప్పుడు రాయల తెలంగాణ గురించే చర్చలు జరుగుతున్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అయోమయంలో పడ్డారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా రాయల తెలంగాణ పై మక్కువ చూపుతున్నట్లు సమాచారం. రాయల తెలంగాణ పై వస్తున్న వార్తలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిసెంబర్ 5న బంద్ కు పిలుపునిచ్చారు. సమైక్యాంద్ర కోసం పోరాటం చేస్తున్న నాయకులు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఎలాంటి ప్రకటన చేయటం లేదు. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలైనట్లు సమాచారం.

 

రాయల తెలంగాణ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దశాబ్దాల కాలంగా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆకాంక్షిస్తున్న పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న నేపథ్యంలో రాయల తెలంగాణను తెరపైకి తేవడం సీమాంధ్ర నాయకుల కుట్రేనని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జీవన్‌రెడ్డి ఆరోపించారు.

 

అసెంబ్లీలోని మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపే ప్రతిపాదనలు తేవడం తెలంగాణను అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రే అన్నారు. సీమకు చెందిన ఆ రెండు జిల్లాలను తెలంగాణలోని పది జిల్లాలతో కలపాలంటే 371-డిని తప్పక సవరించాల్సి ఉంటుందన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles