Pcc chief botsa fire on diwakar reddy

Botsa Satyanarayana, PCC chief, J.C Diwakar Reddy, legislator J.C Diwakar Reddy, congress high command, PCC chief Botsa fire on Diwakar Reddy AICC president, Sonia Gandhi, disciplinary action

PCC chief Botsa Satyanarayana, on Tuesday said he had written a letter to the high command asking it to sack former minister and senior legislator J.C Diwakar Reddy.

షోకాజ్ నోటీస్ లేకుండానే బహిష్కరిస్తాం...

Posted: 12/11/2013 08:58 AM IST
Pcc chief botsa fire on diwakar reddy

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత్రి సోనియా పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సోనియాను పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పిస్తేనే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందని జేసీ దివాకర్ రెడ్డి మాటల పై పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణ ఎట్టకేలకు నోరు విప్పారు. 

ఆయన వ్యాఖ్యల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆయన్ను పార్టీ నుండి బహిష్కరిస్తామని, అహంకారంతో, దొరతనంతో మాట్లాడుతున్న జేసీకి షోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ అడగాల్సిన అవసరం కూడా లేదని, సోనియాను విమర్శించినంత మాత్రాన పెద్ద పుడింగి అవుతాననే భావంతో జేసీ మాట్లాడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ‘ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలి.పార్టీలోనే ఉండాలంటూ ఆయనను ఎవరూ బతిమిలాడ్డం లేదని,  పార్టీ నాయకత్వం నుంచి సోనియాగాంధీని తప్పించాలనడం చాలా తప్పని ఇది సహించరానిదని, ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేసీకి షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే... పార్టీ నుంచి బహిష్కరిస్తాం.

ఈ మేరకు హైకమాండ్‌కు కూడా లేఖ రాశాను అని పేర్కొన్నారు. ఇటు బొత్సనే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కూడా జేసీ పై మండి పడ్డారు.  జేసీ దివాకర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పట్టిన చీడపురుగని,  స్వార్థం కోసం ఆయన ఎంతటి నీచానికైనా దిగజార తారని ఎమ్మెల్సీ ఆమోస్ అన్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై విమర్శలు చేసిన జేసీ దివాకర్‌రెడ్డి పై వెంటనే చర్యలు తీసుకోవాలని రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles