Dr ambedkar statue unveiled at ap assembly compound

Dr Ambedkar statue AP Assembly, Dr.Ambedkar, Governor unveiled Ambedkar statue, Ambedkar Statue beside Gandhi statue

Dr Ambedkar statue unveiled at AP Assembly Compound

శాసనసభ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

Posted: 01/20/2014 05:44 PM IST
Dr ambedkar statue unveiled at ap assembly compound

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట ఆవిష్కరణ ఈరోజు శాసన సభ ప్రాంగణంలో శాసన సభ్యుల, మండలి సభ్యుల సమక్షంలో జరిగింది.  

గవర్నర్ నరసింహన్ చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్, ఉప సభాపతి భట్టి విక్రమార్క, శాసన మండలి ఛైర్మన్ చక్రపాణి, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఇంకా రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు, మండలి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

శాసనసభ ప్రాంగణంలో దళితులు ఆరాధ్యదైవంగా భావించే అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఎంతో కాలంగా ఎందరో నాయకులు పట్టుబడుతూ వస్తున్నారు.  తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత 48 గంటల దీక్ష చెయ్యగా అందుకు ప్రజాసంఘాలు రాజకీయ నాయకులు మద్దతుగా నిలిచారు. 

25 లక్షల ఖర్చుతో ఉత్తర్ ప్రదేశ్ లో తయారైన 500 కిలోల డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రోజు శాసన సభ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి పక్కనే ప్రతిష్టించి ఆవిష్కరించారంటే అది కేవలం ప్రజాసంఘాల నిరంతర పట్టుదలే కారణం. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles