23 లక్షల రూపాయల వ్యయంతో హర్యానాలోని గుర్గావ్ లో తయారు చేయించిన విగ్రహం మీద అంత వ్యయం అవుతుందా అని అనుమానాన్ని ప్రకటించినవాళ్లు, ఇంతా చేసి ఆ విగ్రహంలో పోలికలు అంబేద్కర్ ఫొటోలతో సరిపోలటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.
అంతేకాదు ఆ విగ్రహంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ పోలికలున్నాయంటూ వాళ్ళంతా ఆందోళనకు దిగారు. అక్కడ పెట్టింది అంబేద్కర్ విగ్రహం కాదని కిరణ్ కుమార్ కి అంబేద్కర్ బట్టలు తొడిగినట్లుగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సోమవారం శాసనసభ ఆవరణలో ప్రతిష్టించిన డాక్టర్ అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ పోలికలతో లేదని ప్రజాసంఘాలు కొన్ని విమర్శించాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్ళిన దళిత ఎమ్మెల్యైతే ఆ విగ్రహాన్ని తీసేసి దాన్ని స్థానంలో అంబేద్కర్ రూపు రేఖలతో తయారు చేసిన విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేసారు.
ఇటువంటి ఆరోపణలే లోగడ ట్యాంక్ బండ్ మీది విగ్రహాల మీద కూడా వచ్చాయి. అన్ని విగ్రహాలలోనూ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రూపు రేఖలే కనపడుతున్నాయంటూ పలువురు ఆరోపించారు.
దీనిమీద వివరణనిస్తూ తన మీసాలకు, విగ్రహంలోని మీసాలకు, తన కళ్ళజోడుకి విగ్రహంలోని కళ్ళజోడుకి చాలా తేడా ఉందని, పైగా తను రాసేటప్పుడు చదివేటప్పుడు తప్ప కళ్ళజోడు పెట్టుకోనని, తనెప్పుడూ ఆ విధంగా చెయ్యి పైకెత్తి మాట్లాడలేదని అన్న కిరణ్ కుమార్, అదంతా వాళ్ళ భ్రమని, రోజూ తనని చూస్తుండటం వలన కలిగిన చిత్త భ్రాంతితో వాళ్ళకి అలా కనిపించి ఉండవచ్చని అన్నారు.
దీని మీద పదిమంది శిల్పకారులతో ఒక కమిటీని నియమించి నిజానిజాలను బయటకు తీస్తామని ముఖ్యమంత్రి వాళ్ళకి వాగ్దానం చేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more