Facebook to die down as per research

facebook to die down as per research, Princeton University Scholars research, Research on Facebook, Face book going to decline, Face book to lose 80 percent by 2017

facebook to die down as per research

ఫేస్ బుక్ కి రోజులు దగ్గర పడ్డాయి?

Posted: 01/24/2014 06:03 PM IST
Facebook to die down as per research

సమాజంలో ఫేస్ బుక్ ఒక మహామారిలా వ్యాపించిందని, కానీ దాని మీద ప్రస్తుతమున్న వ్యామోహం అంతరించిపోగానే అది చచ్చిపోతుందని మామూలు ప్రజానీకం అనుకోవటం కాదు,  పెద్దవాళ్ళు పిల్లలను వారించటం కాదు- ప్రిన్సెటన్ విశ్వవిద్యాలయంలో దీని మీద జరిగిన పరిశోధనానంతరం వెలువరించబోతున్న రిసెర్చ్ పేపర్లో బయటకు రాబోతోంది.

వచ్చే మూడు సంవత్సరాలలో ఫేస్ బుక్ వినియోగదారులలో 80 శాతం తగ్గిపోతారని కూడా పరిశోధన తెలియజేస్తోంది.  దీన్ని ఫేస్ బుక్ వృద్ధి చెందిన విధానాన్ని గ్రాఫ్ రూపంలో చూసిన  తర్వాత ఈ నిర్ధారణకు వచ్చారు పరిశోధకులు.

అంటు వ్యాధి మనుషుల మధ్య ఏవిధంగా వ్యాపిస్తుందో అదే పంథాలో సంభాషణ రూపంలో ఒకరి అభిప్రాయాలు మరొకరికి మనుషుల మధ్య జరుగుతూ వస్తోంది.  అది కొన్నాళ్ళకి ఆసక్తిని కోల్పోయేట్టుగా చేస్తుంది.  చెప్పుకోవటానికప్పుడు మాటలే ఉండవు.  అలా మొదలౌతుంది వ్యాధినిరోధకం అన్నారు ప్రిన్సెటన్ పరిశోధకులు. 

ప్రిన్సెటన్ పరిశోధకలు జాన్ క్యానెరెల్లా, జోషువా స్పెష్లర్ ఇద్దరూ ఒక వ్యాధి వ్యాపించటం ఎలా జరుగుతుంది, దాని నిర్మూలనం ఎలా జరుగుతుందన్న విషయాన్ని గ్రాఫ్ రూపంలో పరిశీలించి, ఫేస్ బుక్ వినియోగదారులను కూడా దానితో పోల్చి చూసారు.  మై స్పేస్ నుంచి డేటాని తీసుకుని దాని అభివృద్ధి, పతనాలను పరిగణనలోకి తీసుకుని దాన్ని ఫేస్ బుక్ కి అన్వయిస్తూ పోయి, 2017 లోపులోనే దాని వాడకం 80 శాతం తగ్గిపోతుందని చెప్పగలిగారు. 

ఈ విధమైన వ్యాధి బలపడటం నశించటం అనే దానితో పోల్చటం ఫేస్ బుక్ విషయంలో సరైనదా కాదా, ఇందులో ఇంకా పరిగణనలోకి తీసుకోవలసిన విషయాలు మరెన్నో ఉండవచ్చేమో అన్న ప్రశ్నలు మిగిలిపోయాయి కానీ, ఫేస్ బుక్ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ డేవిడ్ ఎబెర్స్ మన్ మాత్రం గత మూడు నెలలుగా ఫేస్ బుక్ వాడకం తగ్గిపోయిందని, అందులోనూ 19 సంవత్సరాల లోపులో వారే ఎక్కువున్నారని ధృవీకరించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles