Microsoft ceo satya nadella letter to all employees

Microsoft CEO Satya Nadella letter to all employees, Satya Nadella Microsoft new CEO, Microsoft CEO Bill Gates, Microsoft CEO Steve Balmer, Satya Nadella from Hyderabad

Microsoft CEO Satya Nadella letter to all employees

మైక్రోసాఫ్ట్ కొత్త సిఇవో నాదెళ్ళ స్పూర్తిదాయకమైన లేఖ

Posted: 02/05/2014 12:21 PM IST
Microsoft ceo satya nadella letter to all employees

మంగళవారం అధికారికంగా మైక్రోసాఫ్ట్ కి సిఇవో గా నియమితులైన సత్య నాదెళ్ళ ఆ సంస్థ ఉద్యోగులను సంబోధిస్తూ రాసిన లేఖలో ఈ కింది అంశాలున్నాయి:-

మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రపంచంలో కెల్లా గొప్ప సంస్థనీ, 22 సంవత్సరాల క్రితం అందులో చేరిన తను ఈ సంస్థ తన సృజనాత్మకతతో ఎన్నో చమత్కారాలను ప్రపంచానికి చూపిస్తుందని, ఉద్యోగంలో చేరి పనిచెయ్యటానికి ఇంతకంటే మంచి సంస్థ తనకి దొరకదని పూర్తిగా నమ్మానని అన్నారు. 

సంస్థలోని పాత సిఇవోల ప్రస్తావన తెస్తూ, బిల్ స్టీవ్ లు మనసులో మెదిలిన ఒక మెరుపుకి ప్రత్యక్ష రూపమిచ్చారని కొనియాడుతూ, వాళ్ళతో కలిసి కంపెనీలో వివిధ బాధ్యతలను చేపట్టు తాను కూడా పనిచేయటం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. 

ఎన్ని విజయాలు సాధించినా ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఏదో సాధించాలనే తపన ఎప్పటికీ పోదని, అందువలన మన సంస్థ అందరూ పోయే దారిలో గుడ్డిగా పోవటం, వాడుకలోని వ్యవహారశైలిని అనుసరించటం చెయ్యకుండా కొత్త కొత్త పద్ధతులను అన్వేషిస్తుందన్నారాయన.  మొబైల్, క్లౌడ్ రంగంలో మైక్రో సాఫ్ట్ సంస్థ అగ్రగామిగా నిలవాలన్న సంకల్పంతో అందరం పనిచేయాలని అన్నారు. 

46 సంవత్సరాల వయసుగల తను 22 సంవత్సరాలుగా ఈ సంస్థలో పనిచేస్తూ ముగ్గురు పిల్లలతో కుటుంబాన్ని నడుపుతూ ఇప్పటికీ కొన్న పుస్తకాలు పూర్తి కాకముందే ఇంకా పుస్తకాలు కొనటం కొత్త విషయాలను నేర్చుకోవటం, ఆన్ కోర్సుల మీద కోర్సులు చేస్తుంటానని, అలా ఎప్పిటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకోకపోతే మనిషిలో ఎదుగుదల ఉండదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరచారు. 

అందరిలాగానే తాను కూడా మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా ప్రపంచపు రూపురేఖలే మార్చివేద్దామనే ఉద్దేశ్యం లో ఇందులో చేరానని, అందుకు మనందరిలోనూ సామర్ధ్యం ఉందని నాదెళ్ళ అన్నారు.  ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ ఒక పెర్సనల్ కంప్యూటర్ ఉండాలన్న సంస్థ లక్ష్యం చాలావరకు నెరవేరిందన్నారాయన. 

మైక్రో సాఫ్ట్ లో మనం ఎక్కువగా పనిచెయ్యటం కాదు ప్రపంచంలో వివిధ రంగాలలోని వారు ఎక్కువ పని చేసే సామర్ధ్యాన్ని కలిగించటానికి మనం కృషిచేస్తామని వివరణనిచ్చారు సత్య నాదెళ్ళ.  చివరగా ఆయన తోటి ఉద్యోగులనదరినీ తాము చేస్తున్న పనికి అర్థాన్ని సరిగ్గా తెలుసుకోమని, ఇది కేవలం పని కాదని, ఇతరుల పనిలో సామర్థాన్ని పెంచే పనని చెప్తూ, సాధారణంగా మనుషులు తాము చెయ్యగలిగే పనిని తక్కువ అంచనా వేసుకుంటారని, ఇతరులు మన కోసం చేసేదాన్ని ఎక్కువగా ఆశిస్తామని, అలా కాకుండా అందులో మార్పు రావాలని నాదెళ్ళ అన్నారు. 

చాలా సంస్థలు ప్రపంచాన్ని మార్చేద్దామని ఆశిస్తాయి కానీ అందుకు కావలసిన మూడు అంశాలు, శక్తి సామర్థ్యాలు, నిధులు, పట్టుదలతో ముందుకు సాగటం అనేవి ఉండవని, కానీ ఈ మూడూ మైక్రోసాఫ్ట్ లో పుష్కలంగా ఉన్నాయని అందువలన సంస్థ సిఇవో గా ఇంతకంటే ఇంకా ఏదో కావాలని కోరుకోవటం లేదని చెప్తూ,

ఈ పునాది మీద అందరం నిర్మాణాత్మక క్రియాశీల ఫలితాలను సాధిద్దాం అని సత్య నాదెళ్ళ అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles