ఆధ్యాత్మిక అంచుల వరకూ వెళ్ళాలంటే బ్రహ్మచర్యం అవసరమని ప్రాచీన కాలం నుంచి కొన్ని గురుకులాలు బోధిస్తూ వస్తున్నాయి. కఠోర నిష్టలతోనే కుండలినీ శక్తిని మేల్కొల్పవచ్చని కొన్ని ఆశ్రమాలు ప్రబోధించాయి. ఆ నిష్టలలో శృంగారం ఒకటి. ఇంకా మితాహారం, అహింసా ధర్మం, సత్యజీవనం లాంటి నిబంధనలు ఉన్నాయి.
అయితే నిబంధనలన్నీ ఒక ఎత్తైతే శృంగారం ఒక ఎత్తైంది. బుద్ధుడు, కృష్ణుడి విషయంలో చూస్తే వాళ్ళకి వైవాహిక జీవితం అనర్హత కాలేదని తెలుస్తుంది. పురాణాల ప్రకారం ఋషులలో చాలామందికి భార్యలుండేవారు. మరి అలాంటప్పుడు శృంగారం ఆధ్యాత్మిక సాధనకు అడ్డు ఎలా అవుతుంది అనే ప్రశ్న ఉదయిస్తుంది.
అధ్యాత్మకు కూడా మనం మానవరూపం ఆయనకీ భార్య సంసారం ఆపాదించాం. ఆచార్య రజనీష్ మాత్రం బాహాటంగా శృంగారం తప్పు కాదు అని చెప్పారు. మిగిలినవారు ఈ మాటను స్పష్టంగా చెప్పటానికి సంకోచించారు. సంభోగం నుండి సమాధి స్థితికి ఎలా వెళ్ళవచ్చో చెప్పారాయన. అలాగని అదే మార్గం కూడా కాదు.
సహజసిద్ధంగా జీవిస్తూ సహజమైన కోరికలు అనే శారీరక అవసరాలను గుర్తించి వాటిని తీర్చుకోవటం తప్పు కాదు. భోజనం చెయ్యటం తప్పుకాదు కదా. అలాగని వేళాపాళా లేకుండా తింటే ఏమవుతుంది. బాగుంది కదా అని ఎక్కువ తింటే ఏం జరుగుతుంది. శరీరానికి ఏది ఎప్పుడు ఎంత అవసరమో దాన్ని అందిస్తూ జీవించేవారే జీవితంలో ఏదైనా సాధించగలరు.
ఆధ్యాత్మికం వరకూ వెళ్ళే ముందు చదువుకుంటున్నవారినే చూడండి. పెళ్ళి చేస్తే చదువు కుంటుపడుతుందని అందరూ నమ్ముతారు. అందుకే చదువు పూర్తయిన తర్వాత పెళ్ళి అంటారు. చదువు అయిన తర్వాత కూడా కాదు ఏదైనా ఉపాధి దొరికి కాళ్ళ మీద నిలబడిన తర్వాతనే పెళ్ళి అని కూడా అంటారు. అందుకు కారణం మన సమాజ వ్యవస్థ. పెళ్ళవగానే ఖర్చు పెరిగిపోయి, దానికోసం పనిలో పడితే చదువుకోవటానికి సమయం ఉండదు. చదువుకునే వాళ్ళు తిండి తినొచ్చు, రాత్రి పూట పడుకోవచ్చు, అడపాదడపా సినిమాలు కూడా చూడవచ్చు కానీ పెళ్ళి మాత్రం చేసుకోగూడదు అని అనటానికి కారణం సంసార భారం మీద పడి దానితో చదువు కుంటుపడుతుందనే కానీ అక్కడ శృంగారం అడ్డు అని కాదు.
అలాగే ఎన్నో పురాణ గాధల్లో శృంగారం ఆధ్యాత్మికానికి అడ్డు కాదనే చెప్పారు. శివ భక్తుడైన మహారాజు వేశ్యాలోలత్వంలో వేశ్య గృహంలో ఉన్నప్పుడు కూడా శివనామ స్మరణే కాకుండా శివ పూజ చేసాడని, అందుకు వేశ్య స్తనాన్నే శివలింగంగా భావించి పూజాదులు నిర్వహించి తరించాడని చెప్తారు.
ఋష్యశృంగుని కథ తీసుకుంటే ఆయన గురువుగారు స్త్రీ జాతి అంటే ఏమిటో తెలియకుండా పెంచాడాయనను. మొదటిసారి ఒక స్త్రీని చూసినప్పుడు ఆశ్చర్యానందాలు కలుగుతాయి ఆ నిష్టాగరిష్టునికి. అది సహజ స్పందన. ప్రకృతి కలిగించిన భావావేశం. అయినా అతని మహిమలేమీ తగ్గలేదు. దేశాన్ని సుభిక్షం చెయ్యటం కోసం దశరధుడు తలపెట్టిన యాగాన్ని దగ్గరుండి పూర్తి చేయిస్తాడు, ఆ తర్వాత దశరధుని కుమార్తెను పెళ్ళి చేసుకుంటాడు.
అలా పురాణ గ్రంధాలలో స్త్రీ పురుష సంయోగాన్ని తప్పుగా ఎక్కడా చెప్పలేదు. కాకపోతే అతి సర్వత్ర వర్జిత అని చెప్పారు. ఏ పనినీ అతిగా చెయ్యగూడదు, అతిగా ఆశించగూడదు. దేన్నీ వ్యసనంలా తీసుకోగూడదు. జింహ్వ చాపల్యంతో అతిగా తింటే ఏమవుతుందో మనందరికీ తెలుసు. అదే జరుగుతుంది శృంగారంలో కూడా.
భోజనం చేసిన తర్వాత శరీరంలోని జీవకణాలన్నీ ఏవిధంగా సంతృప్తి చెందుతాయో అలాగే మైథునం తర్వాత కూడా జరుగుతుంది- ఇంకా ఎక్కువ పాళాల్లో.
కానీ శృంగారం వద్దంటూ దానికి పెద్ద పీట వెయ్యటం జరిగింది. దానికో ప్రత్యేకతను ఆపాదించి తద్వారా మనుషులలో వ్యామోహంగా మార్చారు దాన్ని. శృంగారమనేది జీవోత్పత్తికోసం ప్రకృతి చేసిన ఒక ఏర్పాటు. శరీరానికి శక్తి కావాలంటే ఆహారం తీసుకోవటం జరుగుతుంది. దానికోసం ఆకలి అనే ప్రకంపన, తినటానికి రుచి అనే జ్ఞానం, శరీరానికి పడని పదార్థాలను శరీరం తిరస్కరించటం, జీర్ణమై శక్తిలో కి మారిన తర్వాత వ్యర్థ పదార్ధాన్ని విసర్జించటం అనేవి ఉండబట్టే మనిషి తిండి తినటం, దానికోసం శ్రమ పడి సంపాదించటం జరుగుతుంది. ఆలోచిచంచి చూడండి- ఆకలి అనేది తెలియక పోతే, దానికి తోడు నోటిలో రుచి అనేది లేకపోతే ఎవరైనా ఏ పదార్థాన్నైనా నిమిలి మింగుతారా? వాటిని సంపాదించటానికి పాటుపడతారా? అది జీర్ణమవటానికి నీళ్ళు తాగుతారా? ఆహార పదార్థాలను పండించే పనులు పెట్టుకుంటారా?
అదే విధంగా శృంగారమనే విధానంలో మనిషికి ఒక అవసరం, తద్వారా తృప్తి అనేదే కల్పించవుండకపోతే ఎవరైనా ఆ పని చేస్తారా- కేవలం సంతానోత్పత్తికోసమని అనుకుంటూ రతిక్రీడలో పాల్గొంటారా?
అందుకే అది సహజసిద్ధమైన అవసరంగా తయారైంది ఆహార పానీయాలు, విరామం విశ్రాంతులలాగానే.
ఇక శృంగారం ఆధ్యాత్మికానికి తోడ్పడుతుందా లేక అవరోధం అవుతుందా అంటే అది మన చేతిలో ఉంది. ఎక్కువగా తినటం కోసం రకరకాల రుచులతో మసాలాలతో దట్టించిన పదార్థాలు తీసుకుంటున్నట్లుగానే శృంగార వాంఛను పెంచుకునే దిశగా మనం అనవసరమైన చేష్టలు చేస్తున్నాం. అక్కడే జరుగుతోంది పొరపాటు. దానితో, శృంగారమే జీవితానికి పరమావధిలా యువతకు ఒక తప్పు అభిప్రాయాన్ని కలిగించటం జరిగింది. ఏ సినిమా చూసినా వాటిలో ప్రేమ పెళ్ళి అనే పేరుతో కథను రాసి దానితోనే ప్రారంభం, దానితోనే కథను అంతం చేస్తున్నారు. నాయికా నాయకుల వివాహం జరిగి చివరకు అందరూ కలిసి గ్రూప్ ఫొటో దిగటంతో సినిమా కథ కంచికి వెళ్తుంది.
దీని వలన మనం ఎటువంటి సంకేతాలిస్తున్నాం, మనిషికి ఎటువంటి అభిప్రాయాలు కలిగేలా చేస్తున్నాం.
కొందరు ఆధునిక భావాలతో ప్రబోధిస్తున్నామనుకుని శృంగారం జరుగుతున్నప్పుడు శరీరంలోని శక్తి కేంద్రాలైన చక్రాలు ప్రేరేపితమౌతాయని, ఆ తర్వాత శక్తి పూరించటం జరుగుతుందని చెప్తారు. అదీ కూడా శృంగారానికి పెద్ద పీట వెయ్యటమే, అలాగే నిబంధనగా పెట్టినా ఎక్కువ విలువను ఆపాదించినట్లే.
శృంగారం ప్రాణులన్నిటికీ ప్రకృతి సిద్ధంగా ఉన్న అవసరం. దాని వలన ఆధ్యాత్మికత పెరగదు, తరగదు కాబట్టి అసలు ప్రాధాన్యతనివ్వకుండా ఉండటమే శ్రేయస్కరం. శరీరావసరాలను దేన్నీ అతిగా ప్రాధాన్యతిచ్చి వాటికోసం వెంపర్లాడకుండా ఉంటే ఆధ్యాత్మికానికి ముందు మనిషిలో ఉత్తమ గుణాలను సంక్రమించేట్టుగా చేస్తుంది. ఉత్తమ గుణాలే ఆధ్యాత్మికానికి దారితీస్తాయి.
ఈసంగతి తెలియకపోవటం వలనే ఆధ్యాత్మికమనేది వార్ధక్యంలో శరీరంలోని వాంఛలన్నీ ఉడిగిన తర్వాత మొదలుపెట్టాలనే ఉద్దేశ్యంలో ఉన్నవాళ్ళే అత్యధిక శాతం ఉన్నారు. కానీ వాంఛలు ఎప్పుడూ ఉడగవు. సామర్థ్యం ఉడుగుతుంది. కానీ తినలేకపోతున్నానే అని బాధపడ్డట్టుగానే శృంగారం జీవితంలోంచి వెళ్ళిపోయిందే అనే బాధలో ఉండేవారు కూడా మనకు కనిపిస్తారు, వాళ్ళల్లో వక్రీకరించిన శృంగారచేష్టలు చేసేవారు కూడా వెలుగులోకి వచ్చిన ఉదంతాలున్నాయి.
ఆధ్యాత్మికమనేది జీవితంలో కార్యకలాపాలన్నీ ఆగిపోయినప్పుడు చేసేది కాదు. అసలు ఆధ్యాత్మికమంటే మన స్వస్వరూపాన్ని గ్రహించటం. అది జీవితానికి చివరి దశ కాదు. మొదటిది. ఆ క్రమంలో మనిషి పెద్దవుతుంటే శరీరానికి అవసరమైన సహజమైన అవసరాలు కోరికల రూపంలో బయటపడుతుంటాయి. వాటిని అర్థం చేసుకుని వాటిని తీర్చటం దినచర్యలో భాగమైతే దీర్ఘకాలిక ప్రణాళిక ఆధ్యాత్మిక సాధనలో పైకి ఎదగటం జరుగుతుంది.
అందువలన, శృంగారం కూడా ఆహార పానీయాలు, విశ్రాంతి, శరీరానికి వ్యాయామం లాంటి అవసరమే. ఆ అవసరాన్ని కలిగించింది ప్రకృతే. కాబట్టి శృంగారం ఆధ్యాత్మిక సాధనకు అడ్డు కాదు.
పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులని, సృష్టికి కారకులని అంటారు. వారిది అన్యోన్యమైన ప్రేమ, ఆదర్శప్రాయమైన దాంపత్యమని చెప్తారు. వారి కలియికలో పార్వతి తన అస్తిత్వాన్నే కోల్పోతుంది. నేనెక్కడున్నాను అని ప్రశ్నిస్తుంది. తనకోసం తను వెతుకుతుంది. అదే ఆత్మ పరిశీలనంటే, దానితో కలిగేదే ఆత్మ జ్ఞానం, ఆ ప్రక్రియలో కలిగేదే ఆత్మానందం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more