Election in ap state may get delayed

Election in AP State may get delayed, Loksabha elections, General elections 2014, Election Commission of India, Congres TRS merger, KCR

Election in AP State may get delayed

ఎన్నికలలనో రేపే ఎన్నికలు దూరం!

Posted: 02/21/2014 09:55 AM IST
Election in ap state may get delayed

రాష్ట్రంలో రావలసిన ఎన్నికల హడావిడి రాష్ట్ర విభజనతో దూరమైపోతోంది.  లోక్ సభతోనే పూర్తైపోయే శాసన సభ ఎన్నికలకు ఈ సారి లోక్ సభతో పాటు ఎన్నికలకు పోయే అవకాశం లేనట్లుగా కనిపిస్తోంది.  అందువలన విభజించబడ్డ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలలు మే నెలలో జరగకపోవచ్చు. 

175 అసెంబ్లీలలతో శేషాంధ్రప్రదేశ్, 119 అసెంబ్లీలతో తెలంగాణా పునర్విభజన జరగటం వలన ఎన్నికల కమిషన్ కి కూడా ఎన్నికల నిర్వహించటం కలిగే జాప్యానికి ఆధారం కూడా దొరుకుతోంది.  ప్రస్తతానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాతో చుక్కాని లేని పడవలా నడుస్తున్న రాష్ట్రం ఎన్నికల వరకు రాష్ట్రపతి పాలనలో నడిచే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండు మూడు రోజులలో తీసుకోవచ్చు. 

ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ తెరాసలు కలిసి లోక్ సభకు 17 సీట్లు సంపాదించే అవకాశం కనపడుతోంది.  అయితే రెండూ కలిసిపోవాలా లేకపోతే విడివిడిగా ఉండే పోటీ చెయ్యాలా అన్నది రెండు పార్టీలూ తేల్చుకోలేకపోతున్నాయి.  లోక్ సభ ఎన్నికలు పునర్విభజిత రాష్ట్రాలలో కలుగజేసే ఫలితాలను బట్టి శాసనసభల ఫలితాల ముందస్తు సంకేతాలు అందే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి లభించబోతోంది.  దానితో పార్టీ వ్యూహ రచనలలో మార్పులు తీసుకుని రావటానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం లభిస్తుంది. 

సీమాంధ్రకు ఇచ్చే ఆర్ధిక పొట్లాలు,  కొత్త రాజధాని మరితర తాయిలాలు సీమాంధ్ర ప్రజల హృదయాలకు కలిగిన గాయాలకు ఉపశమనం కలిగించవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.  సమయం కూడా కొన్ని గాయాలను పూడ్చవచ్చు.  కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత సీమాంధ్రలో కొంత మారవచ్చు.  అందువలన ప్రస్తుతం రాష్ట్రపతి పాలనతో నడిపించి, ఆ తర్వాత రెండు రాష్ట్రలకూ ఎన్నికలను నిర్వహిస్తేనే మేలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles