Kejriwal writes modi about ril

Kejriwal writes Modi about RIL, RIL Gas high pricing, Mukhesh Ambani, Narendra Modi, Rahul Gandhi

Kejriwal writes Modi about RIL, RIL Gas high pricing

ముఖేష్ అంబానీ విషయంలో మోదీకి కేజ్రీవాల్ లేఖ

Posted: 02/21/2014 02:00 PM IST
Kejriwal writes modi about ril

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆఆపా కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ముఖేష్ అంబానీ విషయంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసారు.  అందులో ముఖేష్ అంబానీకి ఇచ్చిన గ్యాస్ ధర మీద ఆయన వైఖరి ఏమిటో స్పష్టం చెయ్యమని కోరారు. 

రిలయన్స్ ఇండియా లిమిటెడ్ అధిపతి ముఖేష్ అంబానీకి ఒప్పందం చేసుకున్నదానికంటే ఎక్కువ రేటున చెల్లించారన్నది కేజ్రీవాల్ వాదన.  దాని మీద మోదీ పెదవి ఎందుకు విప్పటం లేదని కేజ్రీవాల్ ప్రశ్న.  ముఖేష్ అంబానీని ఆరోపిస్తూ పోలీస్ కేసు బుక్ చేసిన సందర్భంలో భాజపా, కాంగ్రెస్ పార్టీలు రెండూ దానినెందుకు వ్యతిరేకించాయని కూడా ఆయన తన లేఖలో ప్రశ్నించారు. పరిమల్ నాథ్వానీ రిలయన్స్ గ్రూప్ కి అధ్యక్షుడవటం, ఆయన రాజ్యసభ సభ్యత్వానికి భాజపా మద్దతు నివ్వటం పలు అనుమానాలకు దారితీస్తుందని కూడా కేజ్రీవాల్ అన్నారు. 

భారత్ లోనూ విదేశాలలోనూ సంచరించటానికి నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ హెలికాప్టర్లు, ప్రైవేట్ విమానాలను ఉపయోగిస్తున్నారని, వాటి యజమానులెవరో చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేసారు.  వాటిని మీరు పైకం చెల్లించి వాడుకుంటున్నారా లేక ఉచితంగానా అన్నది చెప్పాలన్నారు.  నరేంద్ర మోదీ ర్యాలీలకు ముకేష్ అంబానీ ఖర్చు పెడుతున్నారని తెలిసిందని, దానిమీద స్పష్టత కావాలని కూడా కేజ్రీవాల్ కోరారు. 

ఇలాంటి లేఖే రాహుల్ గాంధీకి కూడా పోతుందని, వాటి 10 కోట్ల కాపీలు దేశంలో పంచిపెట్టటం జరుగుతుందని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles