Nandamuri harikrishna fires on tdp chandrababu naidu

Nandamuri Harikrishna, Chandrababu Naidu, tdp, tdp meetings today, ntr trust bhavan, tdp leaders, TDP Chandrababu Naidu.

Nandamuri Harikrishna fires on TDP Chandrababu Naidu

మళ్లీ రచ్చకేక్కిన నందమూరి హరికృష్ణ

Posted: 02/24/2014 05:38 PM IST
Nandamuri harikrishna fires on tdp chandrababu naidu

మాజీ రాజ్యసభ సభ్యుడు  నందమూరి  హరికృష్ణ  మళ్లీ  మీడియా ముందుకు వచ్చారు.  సమైక్యంద్ర కోసం  రాజ్యసభ పదవి రాజీనామా చేసి, ఇంట్లో సైలెంట్ ఉన్న  హరికృష్ణ ఈ రోజు మీడియా ముందుకు వచ్చిన తన గోడు వెల్లబోసుకున్నారు.   ఈరోజు  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు  నాయుడు ఆద్వర్యంలో  ఎన్టీఆర్ ట్రస్టు భవన్  లో   తెలుగు తమ్ముళ్లు తో సమావేశం అయ్యారు.  

అయితే ఈ సమావేశంలో తెలుగు దేశం పార్టీ నాయకులు  ఆవేశం మాట్లాడటం జరిగింది.   చంద్రబాబు నాయుడ్ని పొగడ్తలతో ముంచెత్తారు. కానీ ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి  తారకరామారావు  తనయుడు  హరికృష్ణ  లేకపోవటమే పెద్ద చర్చగా మారింది.   హరికృష్ణ  ఈ సమావేశానికి  ఎందుకు రాలేదని ..పార్టీ అనుకుంటున్న సమయంలో  హరికృష్ణ  మీడియా ప్రత్యక్షం అయ్యాడు. 

నందమూరి హరికృష్ణ  మీడియాలో మాట్లాడుతూ..  తానిప్పుడు అయోమయంలో ఉన్నానని అంటున్నారు. తానసలు టీడీపీలో ఉన్నానో లేనో అర్థం కావడంలేదని అన్నారు. నేడు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి తనను ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

తమ సొంత పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను మీడియా ద్వారానే తెలుసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వెల్లడించారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరం పెడుతున్నారని హరికృష్ణ ఆరోపించారు.  అయిన నందమూరి  హరికృష్ణ  ఇలా ఎన్నిసార్లు  మీడియాలో తన గోడు వెల్లబోసుకోలేదు చెప్పండి. అంత మామూలే .  

బావ చంద్రబాబు  వచ్చి ఒక బిస్కెట్ మాట చెప్పిన వెంటనే.. హరికృష్ణ  మళ్లీ మామూలుగా మారిపోతాడని ..టిడిపి నాయకులే బహిరంగంగానే అంటున్నారు. ఈ సారి  హరికృష్ణ  బావపై ఎలాంటి ప్రకటన చేస్తాడో  చూడాలి.

 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles